Don't Miss!
- Finance
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో బంగారం ధరలిలా!!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చిరంజీవిని దాటేసిన మహేష్.. 19వ రోజు మహర్షి రిపోర్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా నిన్నటితో విజయవంతంగా 19 రోజుల జర్నీ పూర్తిచేసుకుంది. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ మహేష్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా దూసుకుపోతోంది మహర్షి. హై టెక్నీకల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంలోని కథాంశం, నటీనటుల అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రన్ కొనసాగిస్తున్న ఈ సినిమా పొరుగు రాష్ట్రం కర్ణాటక లోనూ హవా కొనసాగిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ 19 రోజుల్లో కర్ణాటకలో విజయవంతంగా ప్రదర్శించబడిన మహర్షి సినిమా 8 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. మరోవైపు యూకే బాక్స్ ఆఫీస్ లో సైతం మహర్షి డీసెంట్ బిజినెస్ కొనసాగిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే 110 వేల డాలర్ల కలెక్షన్స్ రాబట్టి యూకెలో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది.

ఇక 19వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన కల్లెక్షన్స్ చూస్తే.. కోటి రూపాయల షేర్ రాబట్టింది. ఇంత లాంగ్ రన్‌లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయడం విశేషంగానే చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డును తిరగరాసిన మహర్షి 164 కోట్ల రూపాయల మేర కొల్లగొట్టింది. మూడో వారంలో మహర్షి థియేటర్స్‌లో కనిపించిన సందడి ప్రకారంగా మరో రెండు వారాలు ఈ సినిమా జోరుగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ సంయుక్త సమర్పణలో రూపొందిన మహర్షి చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత మహేష్ తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. మే 31వ తేదీన ఈ సినిమా ప్రారంభం కానుంది.