twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarkaru Vaari Paata day 1 collections మహేష్ కెరీర్‌లో ది బెస్ట్.. భారీ కలెక్షన్ల వెనుక ఆ ట్విస్టు!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరుశురాం కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన
    సర్కారు వారీ పాట చిత్రం అంచనాలకు తగినట్టుగానే వసూళ్లను సాధించింది. మిక్స్‌డ్ టాక్‌తో ప్రారంభమైన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కారణంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు సర్కారు వారీ పాట సినిమా కలెక్షన్ల విషయంలోకి వెళితే..

    ఆంధ్రా, నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్

    ఆంధ్రా, నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్

    సర్కారు వారీ పాట ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.50 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.50 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 97 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా బిజినెస్

    తెలుగు రాష్ట్రాలేతర కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 8.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 11 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల బిజినెస్ 120 కోట్ల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 121 కోట్లకుపైగా షేర్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ప్రమోషన్స్, టికెట్ రేట్ల పెంపు

    ప్రమోషన్స్, టికెట్ రేట్ల పెంపు

    సర్కారు వారీ పాట సినిమాకు ముందు మహేష్ బాబు, దర్శకుడు పరుశురాం చేసిన ప్రమోషన్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దాంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దాంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద నమోదు అయ్యాయి. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు కూడా భారీగా కలిసివచ్చింది.

    తొలి రోజు ఏపీ, తెలంగాణలో

    తొలి రోజు ఏపీ, తెలంగాణలో


    సర్కారు వారీ పాట సినిమా కలెక్షన్లు తొలి రోజు ఇలా ఉన్నాయి. నైజాంలో 12.24 కోట్లు, సీడెడ్‌లో 4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.73 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3.25 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 3.00 కోట్లు, గుంటూరు జిల్లాలో 5.83 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.58 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.56 కోట్లు వసూలు చేసింది. దాంతో తొలి రోజున 36.89 కోట్ల షేర్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ఫస్ట్ డే కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో

    ఫస్ట్ డే కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో

    అలాగే సర్కారు వారీ పాట చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 2.70 కోట్లు రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో ఈ సినిమా సుమారు 7 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 45.12 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    సర్కారు వారీ పాట లాభాల్లోకి రావాలంటే?

    సర్కారు వారీ పాట లాభాల్లోకి రావాలంటే?


    సర్కారు వారీ పాట సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 121 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాలి. తొలి రోజు తర్వాత ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే తక్కువలో తక్కువ ఇంకా 76 కోట్లకపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Super Star Mahesh Babu's Sarkaru Vaari Paata hits the theatres on May 12th. Here is Report of day 1 collections worldwide. It collected 62 crores gross, 45 crores share.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X