»   » 100 కోట్ల క్లబ్‌లో స్పైడర్!.. బాక్సాఫీస్ వద్ద మహేశ్ జోరు..

100 కోట్ల క్లబ్‌లో స్పైడర్!.. బాక్సాఫీస్ వద్ద మహేశ్ జోరు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి టాక్ ఎలా ఉన్నా ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన స్పైడర్ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. తొలివారాంతంలో ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. స్పైడర్ సాధించిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

తొలి రెండు రోజుల్లో 72 కోట్లు..

తొలి రెండు రోజుల్లో 72 కోట్లు..

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే రూ.51 కోట్లు వసూలు చేసింది. రెండు రోజులు ముగిసే సరికి కలెక్షన్ల మొత్తం 72 కోట్లకు చేరింది అని నిర్మాతలు ధ్రువీకరించారు.


100 కోట్ల క్లబ్‌లో

100 కోట్ల క్లబ్‌లో

వారాంతానికి చేరుకొనే సరికి స్పైడర్ 100 కోట్లకు చేరుకొన్నట్టు తెలుస్తున్నది. లాంగ్ వీకెండ్ కావడంతో తొలుత తడబాటుకు గురైన స్పైడర్ కలెక్షన్లు.. సెలవు దినాల్లో పుంజుకోవడంతో ఇది సాధ్యమైనట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


యూఎస్‌లో 10 కోట్లకు చేరువలో..

యూఎస్‌లో 10 కోట్లకు చేరువలో..

అమెరికాలోను స్పైడర్ చిత్రం వసూళ్లు మోత మోగిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అమెరికాలో మంగళవారం నుంచి గురువారం వరకు 118361 డాలర్లు వసూలు చేశాయి. శుక్రవారం 87920 డాలర్లు నమోదయ్యాయి. మొత్తంగా అమెరికాలో శుక్రవారం నాటికి స్పైడర్ 8.30 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో 10 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.


తమిళనాడులో ఊపందుకున్న స్పైడర్

తమిళనాడులో ఊపందుకున్న స్పైడర్

ఇటీవల స్పైడర్ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చూసి ప్రశంసించడంతో తమిళనాడులో కూడా వసూళ్లు ఊపందుకొన్నట్టు తెలుస్తున్నది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ''సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు'' అన్నారు.


English summary
Superstar Mahesh Babu’s Spyder, a bilingual spy-thriller, opened to unbelievable hype. Mahesh Babu’s film Spyder might have received mixed reviews, but it seems all set to make producers happy by registering good box office numbers. The film grossed a whopping Rs 51 crore on its first day, despite releasing in the middle of the week. On Friday, the makers confirmed that the film has grossed close to Rs 72 crore in first two days. Spyder is expected to cross the Rs 100 crore mark over the weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu