»   » మహేష్ అంటే మాటలా? : 'బ్రహ్మోత్సవం' ప్రీ రిలీజ్ బిజినెస్ భీబత్సం (ఏరియావైజ్)

మహేష్ అంటే మాటలా? : 'బ్రహ్మోత్సవం' ప్రీ రిలీజ్ బిజినెస్ భీబత్సం (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ప్రమోషన్స్ మొదలయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌, సాంగ్ టీజర్స్ కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం .. ప్రపంచవ్యాప్త ధియేటర్ రైట్స్ 72 కోట్లకు అమ్ముడయ్యాయి. అందులో ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ వెర్షన్ రైట్స్, యూట్యూబ్ రైట్స్ వంటివి అన్ని కలిపితే వంద కోట్ల మార్కుని ఈజీగా చేరుతుందని అంచనా వేస్తున్నారు.


సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను మే 7న నిర్వహించనున్నారు.


స్లైడ్ షోలో బ్రహ్మోత్సవం ప్రీ రిలీజ్ బిజినెస్, ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు ఇస్తున్నాం...


నైజాం

నైజాం

'బ్రహ్మోత్సవం' 16.2 కోట్లకు అభిషేక్ పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు.సీడెడ్

సీడెడ్

'బ్రహ్మోత్సవం' ..చిత్రాన్ని 9 కోట్లకు సీడెడ్ రైట్స్ ని పకల్ మురళి సొంతం చేసుకున్నారు.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

'బ్రహ్మోత్సవం' చిత్రం ఉత్తరాంధ్ర రైట్స్ ని 5.60 కోట్లకు ఎస్ వి సినిమాస్ వారు సొంతం చేసుకున్నారు.గుంటూరు& కృష్ణా

గుంటూరు& కృష్ణా

'బ్రహ్మోత్సవం' చిత్రం గుంటూరు& కృష్ణా రైట్స్ ని ఎస్ క్రియేషన్స్ వారు ఎనిమిది కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

'బ్రహ్మోత్సవం' చిత్రం తూర్పు గోదావరి ఏరియా రైట్స్ ని మణికంఠ 5 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

'బ్రహ్మోత్సవం' చిత్రం పశ్చిమ గోదావరి జిల్లా రైట్స్ ని LVR 4.20 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.నెల్లూరు

నెల్లూరు

'బ్రహ్మోత్సవం' చిత్రం నెల్లూరు జిల్లా రైట్స్ ని భాస్కర రెడ్డి 2.5 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.ఎపి,తెలంగాణా కలిపి

ఎపి,తెలంగాణా కలిపి

'బ్రహ్మోత్సవం' చిత్రం ఎపి, తెలంగాణా ధియోటర్ రైట్స్ మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 50.50 కోట్లు జరిగిందికర్ణాటక

కర్ణాటక

'బ్రహ్మోత్సవం' చిత్రం కర్ణాటక రైట్స్ ని గోల్డీ 7 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారు.భారత్ లో మిగతా ప్రాంతాలు

భారత్ లో మిగతా ప్రాంతాలు

బ్రహ్మోత్సవం భారత్ లో మిగతా ప్రాంతాల రైట్స్ 1.5 కోట్లకు ధియోటర్ రైట్స్ అమ్ముడయ్యాయి,ఓవర్ సీస్

ఓవర్ సీస్

ఓవర్ సీస్ రైట్స్ మొత్తం 13 కోట్లకు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు.


ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

బ్రహ్మోత్సవం ...వరల్డ్ వైడ్ గా ..ప్రీ రిలీజ్ ధియోటర్ బిజినెస్ విషయానికి వస్తే..72 కోట్లు జరిగింది.English summary
'Brahmotsavam' Worldwide theatrical rights have been sold out for a whooping Rs 72 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu