»   »  మహేష్‌ 'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్ రూ. 51 కోట్లు

మహేష్‌ 'స్పైడర్‌' మొదటి రోజు కలెక్షన్ రూ. 51 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 51 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.

ఈ సందర్భంగా నిర్మాతలు ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''భారీ బడ్జెట్‌తో సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో నిర్మించిన 'స్పైడర్‌' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ
ఓపెనింగ్స్‌ వచ్చాయని తెలిపారు.


ఓవర్సీస్ ప్రీమియర్స్

ఓవర్సీస్ ప్రీమియర్స్

‘స్పైడర్' మూవీ ఓవర్సీస్‌ ప్రీమియర్స్‌లోనే 1 మిలియన్‌ డాలర్లకుపైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది.నిర్మాతలు హ్యాపీ

నిర్మాతలు హ్యాపీ

ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' మొదటిరోజు 51 కోట్లు కలెక్ట్‌ చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగించిందని ఠాగూర్ మధు తెలిపారు.ప్రేక్షకులకు థాంక్స్

ప్రేక్షకులకు థాంక్స్

ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత భారీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌, మురుగదాస్‌గార్లకు మా కృతజ్ఞతలు అని ఠాగూర్ మధు తెలిపారు.


స్పైడర్

స్పైడర్

స్పైడర్ సినిమా రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమాకు కాస్త డివైడ్ టాక్ ఉన్నా మంచి బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


English summary
Mahesh, AR Murugadoss's Action Entertainer 'Spyder' Presented by Tagore Madhu, Produced by NV Prasad under NVR Cinemas LLP, Reliance Entertainments released yesterday with big openings all over.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu