For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'శ్రీమంతుడు' దూకుడు : 17 రోజులకే దాటేసింది

  By Srikanya
  |

  హైదరాబాద్‌: మహేష్‌ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

  మహేష్ కెరీర్ లోనే టాప్ గా నిలిచిన దూకుడు చిత్రం 56 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ 17 రోజులకే 75.97 సాధించి ట్రేడ్ లో అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 17 రోజుల కలెక్షన్స్ ఒక్కసారి చూద్దాం.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'శ్రీమంతుడు' 17 రోజుల కలెక్షన్స్ :

  నైజాం: రూ 19.39 కోట్లు

  సీడెడ్ : రూ 8.23 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ 4.82 కోట్లు

  గుంటూరు: రూ 5.02 కోట్లు

  కృష్ణా : రూ 3.89 కోట్లు

  తూర్పు గోదావరి: రూ 5.09 కోట్లు

  పశ్చిమ గోదావరి: రూ 3.87 కోట్లు

  నెల్లూరు: రూ 1.81 కోట్లు

  'శ్రీమంతుడు' 17 రోజులు ఎపి & నైజాం కలెక్షన్స్ : రూ 52.12 కోట్లు

  కర్ణాటక: రూ 6.55 కోట్లు

  తమిళనాడు: రూ 1.02 కోట్లు

  భారత్ లో మిగతా ప్రాంతాలు: రూ 1.03 కోట్లు

  'శ్రీమంతుడు' 17 రోజుల మొత్తం భారత్ లో కలెక్షన్స్ : రూ 60.72 కోట్లు

  అమెరికా: రూ 11.99 కోట్లు

  మిగిలిన ఓవర్ సీస్ : రూ 2.28 కోట్లు

  'శ్రీమంతుడు' 17 రోజుల ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ ( తెలుగు వెర్షన్ ): రూ 74.99 కోట్లు

  'శ్రీమంతుడు' 17 రోజుల ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ (అన్ని వెర్షన్స్ ): రూ 75.97 కోట్లు

  Mahesh's Srimanthudu: 17 Days Collections

  మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

  మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.

  దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.

  జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,

  కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

  English summary
  'Srimanthudu' emerged as Mahesh Babu's career best grosser by surpassing 'Dookudu' (Rs 56 Cr) by a big margin of at least 20 cr. Srimanthudu Movie featuring Mahesh Babu, Shruti Haasan. Directed by Koratala Siva and music composed by DSP.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X