»   » ఓవర్ సీస్ లో మహేష్...ఓ రేంజి పంచ్

ఓవర్ సీస్ లో మహేష్...ఓ రేంజి పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు.

క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.

Mahesh's Srimanthudu got record price for overseas

చిత్రం గురించి మాట్లాడుకుంటే...తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం పొల్లాచ్చిలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వం ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు.

ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Mahesh Babu, Shruti Haasan's ‘Srimanthudu’s overseas distribution rights are sold for a record price. Buzz is Classic Entertainments bagged the rights for a whopping Rs 8.1 crs.
Please Wait while comments are loading...