»   »  హాలీడే నుంచి వచ్చాక చూస్తా: మహేష్ బాబు

హాలీడే నుంచి వచ్చాక చూస్తా: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ పనిలో పనిగా తన బావ సినిమాకు సైతం ట్వీట్లతో ప్రమోట్ చేసి అందరి దృష్టీ ఆ సినిమాపై పడేలా చేస్తున్నారు. ఆయన తన అభిమానులను ఆ సినిమా వైపు చూసేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన గతంలోనూ ఈ సినిమా ట్రైలర్ తో ఓ ట్వీట్ చేసారు. ఇప్పుడు రిలీజ్ అయ్యాక మరో ట్వీట్ చేసారు. ఆయన తన సొంత సినిమాలకు కూడా ఇంతలా ప్రమోట్ చేసుకోరు.

తన బావ అయిన సుధీర్ బాబు నటించిన సినిమా భలే మంచి రోజు మంచి రివ్యూలనందుకుంన్నందుకు ఈ సినిమా టీంకు మహేష్ శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబందించిన ట్వీట్ ఇక్కడ మీరు చూడవచ్చు.

మహేష్ ట్వీట్ చేయడం ద్వారా సినిమా చూడటానికి ప్రేక్షకులు పెరుగుతారని అంచనాతో నిర్మాత ఆనందంగా ఉన్నారు.

Mahesh tweeted on 'Bhale manchi roju'

భలే మంచి రోజు కథేమిటంటే...

తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి మాయ (ధన్య బాలకృష్ణ) వేరే వాడితో పెళ్లికి సిద్దపడితే... కోపం తెచ్చుకున్న కుర్రాడు రామ్ (సుధీర్ బాబు) ఆమెకు బుద్ది చెప్దామని బయిలుదేరుతాడు. అయితే అనుకోకుండా ఆ జర్నిలో ఓ యాక్సిడెంట్ జరిగి .. ఏరియా దాదా శక్తి(సాయికుమార్) చేతిలో ఇరుక్కుపోతాడు. రామ్ ని అతని స్నేహితుడు ..కాబోయే బావ ఆది (ప్రవీణ్ ) తన డెన్ కు తెచ్చిన శక్తి రామ్ కి ఓ కండీషన్ పెడతాడు.

నీ యాక్సిడెంట్ తో నేను కిడ్నాప్ చేస్తున్న సీత (వామిక గబ్బి) అనే అమ్మాయి తప్పించుకుపోయింది కాబట్టి... ఆ అమ్మాయిని వెతికి తీసుకురా...లేకపోతే మీ స్నేహితుడుని ప్రాణాలు తీస్తా అంటాడు. అక్కడ నుంచి రామ్ ... ఆ అమ్మాయి సీతని వెతకడం మొదలెడతాడు. అందుకోసం ఈశు(వేణు), ఆల్బర్ట్ అనే ఇద్దరు కిడ్నాపర్స్ తో డీల్ పెట్టుకుంటాడు. వాళ్ళ సాయింతో ఆమెను పట్టుకోగలిగాడా... అసలు శక్తి ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు..అసలు వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ట్విస్ట్ లతో సాగే మిగతా కథ.

English summary
Mahesh Babu tweeted, “Hearing good reviews for #BhaleManchiRoju. Will watch once i am back.congrats to isudheerbabu n the entire team".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu