twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఈగ' హిందీ వెర్షన్ రిజల్ట్ ఏమిటి?

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ' హిందీలోకి మక్కీ టైటిల్ తో డబ్ అయ్యి క్రిందటి వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగులో చేసినట్లు బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. బాలీవుడ్ కి ఈ సినిమా ఎక్కలేదు అని అక్కడ ట్రేడ్ ఎనాలిసిస్ట్ లు తేల్చి చెప్పారు. వారు ఈ చిత్రాన్ని ఓ ప్లాఫ్ షో గా అబివర్ణించారు. ఈ హిందీ చిత్రానికి రాజమౌళి ఎంత పబ్లిసిటీ చేసినా,అజయ్ దేవగన్ వంటి స్టార్ వాయిస్ ఇచ్చినా పెద్దగా ఉపయోగపడలేందంటున్నారు. అలాగే సరైన ప్రమోషన్ లేకపోవటం ప్లాప్ కు కారణం అని చెప్తున్నారు. అలాగే శుక్రవారం రిలీజైన ఈ చిత్రం శనివారమే కొద్ది ధియేటర్స్ లో తీసేసారని ట్రేడ్ టాక్.

    ఇక మక్కీ చిత్రం తో పాటు విడుదలైన అయ్యా, భూత్ రిటర్న్ చిత్రాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మరో ప్రక్క ఈ చిత్రం పై నేషనల్ మీడియాలో రకరకాలు కథనాలు వెలుబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ చిత్రం ఓ ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. రివ్యూలలో సైతం ఈ విషయం ప్రస్తావిస్తున్నారు. ఆ షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). మార్చి 2010లో వచ్చిన ఈ షార్టి ఫిలిం కథ దర్శకుడు లూక్ ఈవ్ (Luke Eve). ఈ షార్ట్ ఫిలింలో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి బొద్దింక గా పునర్జన్మ ఎత్తుతాడు. బొద్దింకగా తన గర్ల్ ప్రెండ్ ని కలుసుకుంటాడు. అది ఓ రొమాంటిక్ కామెడీ. అయితే రాజమౌళి తన తండ్రి దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ కథను తనకు చెప్పారంటున్నారు.

    మరో ప్రక్క 'ఈగ' చిత్రం జపనీస్, స్వాహిలి(కెన్యా) బాషల్లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ....'ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది. అనంతరం మలయాళం, హిందీలో కూడా అనువదించి మంచి ఫలితాలను సాధించాం. జపనీస్, స్వాహిలి భాషల్లోకి కూడా ఈచిత్రాన్ని అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తోందని' అన్నారు.

    ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.

    English summary
    Last weekend was the most unsuccessful one for Bollywood this year. All three releases — Aiyyaa, Bhoot Returns and Makkhi — were duds at the box-office. And none are expected to sustain business through the week. Trade analyst Vinod Mirani says...“Makkhi didn’t do well because of the lack of good promotions. As for the other two, they’re not going to last. Some theatres stopped on the shows on Saturday itself.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X