'ఈగ' హిందీ వెర్షన్ శాటిలైట్ రేట్ ఎంత?
ముంబై : రాజమౌళి 'ఈగ' హిందీలోకి మక్కీ టైటిల్ తో డబ్ అయ్యి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగులో చేసినట్లు బాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అక్కడ ప్లాప్ అయ్యింది. అయితేనేం ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డు రేటుకు అమ్ముడుపోయిందని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రేటు ఎనిమిది కోట్లు పలికిందంటూ వినిపిస్తోంది. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేటు పలకటం మూమూలు విషయం కాదంటున్నారు. అందులోనూ తెలుగు వెర్షన్ ని దసరా సందర్భంగా టీవిల్లో ప్రదర్శించేసారు. అయితే పిల్లలను ఈ చిత్రం ఆకట్టుకునే అవకాసం ఉంది కాబట్టి ఆ కోణంలో ఈ చిత్రానికి ఫ్యాన్సీ రేటు పలికిందంటున్నారు.
ఈ చిత్రాన్ని తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేసారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అన్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా రైట్సే తీసుకుని విడుదల చేసింది.
ప్రస్తుతం 'ఈగ' చిత్రం జపనీస్, స్వాహిలి(కెన్యా) బాషల్లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ....'ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది. అనంతరం మలయాళం, హిందీలో కూడా అనువదించి మంచి ఫలితాలను సాధించాం. జపనీస్, స్వాహిలి భాషల్లోకి కూడా ఈచిత్రాన్ని అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తోందని' అన్నారు.
'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ' ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications











