అఖిల్ కోసం 50 ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ హీరో.. మూడు సీన్లకే సాలీడ్ రెమ్యునరేషన్!

టాలీవుడ్. ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హీరోల్లో అఖిల్ మొదటి స్థానంలో ఉంటాడు. ఎందుకంటే అక్కినేని లాంటి ఉన్నతమైన బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ చిన్నోడు ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు. ఇక ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని తదుపరి సినిమాల కోసం ప్రాణం పెట్టి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక అఖిల్ చేస్తున్న ఏజెంట్ సినిమాలో 50ఏళ్ళ కెరీర్ ఉన్న సీనియర్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనకు సాలీడ్ రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది.

మొదటి మూడు సినిమాలు..

మొదటి మూడు సినిమాలు..

అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటాడాని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. అనంతరం సింపుల్ గా లవ్ స్టోరీతో హిట్ అందుకోవాలని చేసిన హలో ప్రయోగం కూడా సక్సెస్ అవ్వలేదు. ఇక మూడవ సినిమా మిస్టర్ మజ్ను కూడా అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు.

చాలామంది సలహాలు ఇచ్చారు

చాలామంది సలహాలు ఇచ్చారు

ఎలాగైనా ఫామ్ లోకి రావాలని అఖిల్ కష్టపడుతున్నాడు గాని ఎక్కువగా రోటీన్ సినిమాలు అవుతున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తే బావుంటుందని చాలామంది సలహాలు ఇచ్చారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న అఖిల్ అందులో రెగ్యులర్ గానే కనిపించినప్పటికీ ఆ తరువాత వచ్చే సినిమాలో మాత్రం కొత్తగా కనిపించనున్నాడు.

అఖిల్ న్యూ లుక్

అఖిల్ న్యూ లుక్

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న అఖిల్ 5వ సినిమా ఏజెంట్ పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అఖిల్ న్యూ లుక్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక సినిమాను దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని సమాచారం.

50 ఏళ్ళ అనుభవం ఉన్న నటుడు

50 ఏళ్ళ అనుభవం ఉన్న నటుడు

ఏజెంట్ కథను మలుపు తిప్పే ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళం సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ పాత్ర కోసం చాలామంది తెలుగు అగ్ర నటులను అనుకున్నప్పటికి ఎందుకో సెట్టవ్వడం లేదట. ఇక నటుడిగా 50 ఏళ్ళ అనుభవం ఉన్న మమ్ముట్టి అయితే పర్ఫెప్ట్ అని ఫిక్స్ చేశారట.

Recommended Video

Shakeela Sensational Comments On Allu Arjun | ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
మమ్ముట్టి రెమ్యునరేషన్ ఎంతంటే

మమ్ముట్టి రెమ్యునరేషన్ ఎంతంటే

సినిమాలో ఆయన సీన్స్ చాలా తక్కువగా ఉంటాయట. కాకపోతే సినిమా కథకు అవే కీలకమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఆయనకు 3కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. చివరగా మమ్ముట్టి తెలుగులో వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో నటించిన విషయం తెలిసిందే. 69ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో కనిపించే మమ్ముట్టి అఖిల్ సినిమాలో కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X