»   » ‘మనం’ మూవీ 7 డేస్ కలెక్షన్స్...

‘మనం’ మూవీ 7 డేస్ కలెక్షన్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' బాక్సాఫీసు వద్ద విజయవంతంగా దూసుకెలుతోంది. తాజాగా ఈచిత్రం వారం రోజులు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఇటు ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీసు వద్ద అటు ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద ప్రస్తుతం ప్రదర్శితం అవుతున్న తెలుగు సినిమాలన్నింటి కంటే వసూళ్ల పరంగా టాప్ లో నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా మే 23న 'మనం' చిత్రం దాదాపు 800 స్క్రీన్లలో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో వసూళ్లు కేక పుట్టిస్తున్నాయి. ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈచిత్రం తొలి 6 రోజుల్లో రూ. 12.15 కోట్లు వసూలు చేసింది. 7వ రోజు వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Manam (7 Days) First Week Collection At Box Office

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నైజాంలో రూ. 4.76 కోట్లు, సీడెడ్ రూ. 1.77 కోట్లు, వైజాగ్ రూ. 1.18 కోట్లు, గుంటూరు 81 లక్షలు, క్రిష్ణా రూ. 85 లక్షలు, ఈస్ట్ గోదావరి 64 లక్షలు, వెస్ట్ గోదావరి 63 లక్షలు, నెల్లూరు రూ. 37 లక్షలు, కర్నాటక రూ. 90 లక్షలు, తమిళనాడు 19 లక్షలు, నార్త్ ఇండియాలో రూ. 2 లక్షలు, ఒరిస్సాలో రూ. 2 లక్షలు వూసూలు చేసింది.

మరో వైపు ఓవర్సీస్ బాక్సాఫీసు వద్ద కూడా మనం దుమ్ము రేపుతోంది. ఇక్కడ ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 6.45 కోట్లు వసూలు చేసింది. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.

ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

English summary
Among two much-hyped Telugu releases, Manam has received an earth-shattering response and concluded the first week with a fantastic collection at the worldwide Box Office. The late Akkineni Nageswara Rao, Nagarjuna and Naga Chaitanya starrer has topped the business chart in Andhra Pradesh and the USA, pushing down another new release Vikramsimha featuring Rajinikanth and Deepika Padukone in the leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu