»   »  ఓవర్సీస్‌ కలెక్షన్స్: నాగార్జున కెరీర్లో ‘మనం’ రికార్డ్

ఓవర్సీస్‌ కలెక్షన్స్: నాగార్జున కెరీర్లో ‘మనం’ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని మూడుతరాల హీరోలు నటించిన మల్టీస్టారర్ మూవీ 'మనం' ఓవర్సీస్‌లో మంచి ఫలితాలు రాబట్టింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం గురువారం ప్రీయమిర్ షో, శుక్రవారం కలుపుకుని రూ. 1.71 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున, నాగ చైతన్య కెరీర్లో ఏ సినిమా కూడా ఓవర్సీస్‌లో ఈ రేంజిలో కలెక్షన్లు సాధించలేదు..ఇదో రికార్డు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడంతో ఈచిత్రంపై ముందు నుండి మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ షో తర్వాత సినిమా టాక్ హై రేంజిలో వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు. ఈ మధ్యకాలంలో వరస ఫ్లాపులతో ముందుకు వెళ్తున్న నాగార్జున ఈ చిత్రం హిట్ తో ఊపిరిపీల్చుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. అక్కినేని చివరి చిత్రం కావటం కూడా ఎమోషనల్ గా ఈ చిత్రం ఆయన అభిమానులకు గిప్ట్ గా భావిస్తున్నారు. ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథగా తెరకెక్కింది.

Manam Crossed 1.7 Cr in overseas

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

English summary

 As per the reports Manam has collected $95,473 from Thursday previews and collected $196,608 on Friday. So far the film has collected $292,081 [Rs 1.71 cr] in USA which is a record in Nagarjuna's career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu