»   »  ఇదో రకం రికార్డ్: ఫ్యామిలీలో అందరికీ తలో ఫ్లాపు పంచిన వర్మ

ఇదో రకం రికార్డ్: ఫ్యామిలీలో అందరికీ తలో ఫ్లాపు పంచిన వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వర్మని పూర్తిగా మంచు కుటుంబం నమ్మింది. నమ్మిన వారినే ముంచాలి అన్నట్లు గా వర్మ..వారందకీ మొహమాటం లేకుండా ఒక్కరినీ వదల పెట్టకుండా ఫ్లాప్ ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ ఇవ్వకపోవటం చిత్రం.

ఇంత రికార్డ్ టాలీవుడ్ లో వర్మ కు, ఈ కుటుంబానికే దక్కిందేమో. ఒకే దర్శకుడుతో వరస సినిమాలు..అవీ వరస ప్లాఫుల్ కావటం మామూలు విషయం కాదు. కానీ ఆ ఫ్యామిలీ వారు ఎక్కడా చిన్న మాట కూడా వర్మని అనలేదు. ఇప్పటికీ ఆయన్ను అత్యంత గొప్ప దర్శకుడుగానే వారు అభివర్ణిస్తూంటారు.

వర్మకు మొదట కనెక్ట్ అయ్యింది మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె తన నటనతో వర్మను మెప్పించింది. ఆమె నటన చూసి వర్మ మెచ్చుకుని ఆమెతో ఆయన సినిమా మొదలెట్టి చివరకు ఆమె తండ్రి, ఇద్దరు సోదరులతోనూ సినిమాలు తీసారు. చివరకు షార్ట్ ఫిల్మ్ ని కూడా ఆమె తోనే తీసాడు. అదీ మిగిలిపోయిన షార్ట్ ఫిల్మ్ గానే పెద్ద క్రేజ్ తెచ్చుకోలేకపోయింది.

వర్మ..మంచు ఫ్యామిలితో చేసిన సినిమాల లిస్ట్...

దొంగల ముఠా

దొంగల ముఠా

వర్మ మొట్టమొదటి సారిగా మంచు లక్ష్మిని ప్రధాన పాత్రలో పెట్టి, రవితేజ,ఛార్మిలను కలుపుకుని దొంగల ముఠా చిత్రం రూపొందించారు. అదీ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

రౌడి

రౌడి

ఈ సారి మంచు విష్ణు, మంచు మోహన్ బాబులతో కలిసి ఆయన రౌడీ చిత్రం చేసారు. ఆ సినిమా కూడా భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయ్యింది. డైలాగులకు పేరు వచ్చినా ఆడలేదు.

అనుక్షణం

అనుక్షణం

మంచు విష్ణు హీరోగా రూపొందిన ఈ ధ్రిల్లర్ చిత్రం చివరకు రిలీజైందనే విషయం కూడా తెలియనంత ఫ్లాఫ్ అయ్యింది.

ఓ రోజు మంచు లక్ష్మి పాదాలు

ఓ రోజు మంచు లక్ష్మి పాదాలు

మంచులక్ష్మి పాదాలపై వర్మ ఓ షార్ట్ ఫిల్మ్ ని డిజైన్ చేసారు. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ కూడా అంతంత మాత్రం రిజల్ట్ వచ్చింది.

ఎటాక్

ఎటాక్

మంచు మనోజ్ హీరోగా వర్మ దర్శకత్వంలో వచ్చన ఈ సినిమా రీసెంట్ గా రిలీజైంది. అయితే ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.

English summary
RGV is the only director who gave disasters to all the actors from a single family. The family that shared this ridiculous record feat is the Manchu family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu