»   »  నిజం: 'సర్దార్' కు మంచు హీరో దెబ్బ...చాలా చోట్ల ఈ రోజు నుంచే

నిజం: 'సర్దార్' కు మంచు హీరో దెబ్బ...చాలా చోట్ల ఈ రోజు నుంచే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా వచ్చిన ఆడో రకం, ఈడో రకం చిత్రం సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ నేపధ్యంలో ఈ రోజు నుంచి సర్దార్ చిత్రాన్ని తీసేసి చాలా ఏరియాల్లో ఈ చిత్రాన్ని వేయటం మొదలెట్టారు ఎగ్జిబిటర్స్. 'ఈడో రకం ఆడో రకం' సినిమా మల్టీప్లెక్స్ తో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నట్లు తెలియడంతో నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.


Manchu Vishnu's Eedo Rakam Aado Rakam Kicks Out Sardaar

పంజాబి చిత్రం క్యారీ ఆన్ జట్టాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో కథ కొత్తగా లేకపోయినా పాత్రల మధ్య ఉన్న కన్ఫ్యూజన్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కలిసి వచ్చింది. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర నిర్మించగా ఈ సినిమాలో సోనారిక భడోరియా, హెబ్బా పటేల్ హీరోయిన్‌లు గా నటించారు.

English summary
In many areas, extra theaters have been added for Eedo Rakam Aado Rakam from today and most of these theaters were earlier allotted to Sardaar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu