»   » విష్ణు మంచు లక్కున్నోడు ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్

విష్ణు మంచు లక్కున్నోడు ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం లక్కున్నోడు. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Luckckunnodu

దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ల‌క్కున్నోడు. సినిమా ప్ర‌స్తుతం ల‌క్కున్నోడు సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. ల‌వ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైనర్‌గా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంలో మంచు విష్ణు స‌రికొత్త లుక్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు.

తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌: రెడ్డి విజ‌య్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,

English summary
Manchu Vishnu, Hansika Motwani combination Luckckunnodu first look is released to media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu