»   » మణిరత్నం,కార్తి కాంబో రొమాంటిక్ చిత్రం తెలుగు టైటిల్ మారిందొహో

మణిరత్నం,కార్తి కాంబో రొమాంటిక్ చిత్రం తెలుగు టైటిల్ మారిందొహో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం- కార్తీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం తెలుగు వెర్షన్ కు 'డ్యూయెట్' అనే టైటిల్ పెట్టి ఆ మధ్యన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఆ టైటిల్ జనాల్లోకి పెద్దగా వెళ్లటం లేదు అనుకున్నారో ఏమో ...తెలుగు వెర్షన్ టైటిల్ ని మార్చారని సమాచారం. ఆ టైటిల్ మరేదో కాదు...చెలియా. తమిళంలో 'కాట్రు వెలియిదై' తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో చెలియా టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

అదితిరావు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రెండు..మూడవ షెడ్యూల్స్ కాశ్మీర్‌, చెన్నైలలో జరిగాయి. తెలుగువెర్షన్ ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కార్తి ఓ పైలట్ గా నటిస్తున్నాడట. అంతేకాకుండా సినిమాలో కార్తి ఓ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చురుగ్గా జరుగుతుండగా, ఎప్పటిలాగే మణిరత్నం ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే సినిమాలోని కొన్ని కీలక పాత్రల్లో కోలీవుడ్ సీనియర్ నటులు కనిపించబోతున్నారట.

Mani Ratnam's film titled Cheliya

మణిరత్నం కెరీర్లో కొన్ని ప్లాపులు ఉన్నప్పటికీ....ఆయన సినిమాలను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. మణి చివరి సినిమా 'ఓకె కన్మణి'(తెలుగులో ఓకే బంగారం) చిత్రం భారీ విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియా పై మంచి అంచనాలే ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన అదితి రావు హైదరి ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. మణి, కార్తి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతాయి. తెలుగులో వీరిద్దరి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది కూడా. త్వరలోనే తెలుగు పోస్టర్ రిలీజ్ చేస్తారు.

English summary
Karthi starrer film directed by Manirathnam has been re-titled. The film will now be known as Cheliya. Earlier it was known as Duet. Why the film is being re-titled, the makers are yet to tell.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu