»   » మణిరత్నం ‘ఓకే బంగారం’ ఆడియో తేదీ ఖరారు

మణిరత్నం ‘ఓకే బంగారం’ ఆడియో తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా మద్రాస్‌ టాకీస్‌ పతాకంపై మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘ఓకే కణ్మణి'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమతి అనిత సమర్పణలో దిల్‌ రాజు ‘ఓకే బంగారం' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని మార్చి 27న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఇప్పటికే మెంటర్ మదిలో సాంగ్..అబిమానులను ఊపేస్తోంది.ఈ సినిమాలో హీరో దుల్కర్‌ సల్మాన్‌కు నాని డబ్బింగ్‌ చెబుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాని మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారికి నేను వీరాభిమానిని. ఆయన అడగడంతోపాటు దిల్‌ రాజుగారి మీదున్న గౌరవంతో హీరో పాత్రకు డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించాను. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ‘సఖి' కంటే గొప్పగా ఉంటుందనిపించింది. కచ్చితంగా ‘సఖి''ని మించి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.

Maniratnam’s OK Bangaram audio release date confirmed

దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘గతంలో సఖి సినిమాను నైజాంలో విడుదల చేశాను. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ఓకే బంగారం' సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం గొప్పగా ఫీలవుతున్నాను. మణిరత్నంగారి దర్శకత్వం, పి.సి.శ్రీరామ్‌ ఫొటోగ్రఫీ, రెహమాన్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మార్చి నెలాఖరులో పాటల్ని, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి'ను నిర్మించారు.

మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్‌షీట్స్‌ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.

చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంటోం ది.


హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో విడుదల కాబోతోంది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటిస్తోందీ భామ.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.

English summary
Maniratnam’s OK Bangaram audio of OK Bangaram will be released on March 27th. AR Rahman composed the music. Dil Raju bagged the Telugu rights of this film which is being simultaneously made in Tamil titled Ok Kanmani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu