For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మన్మధుడు 2 ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్... చివరకు ఏం తేలిందంటే?

  |

  నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'మన్మధుడు 2' మూవీ గురువారంతో తొలివారం పూర్తి చేసుకుంది. ముందు నుంచి ఈ చిత్రంపై భారీ హైప్ ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రిలీజ్ రోజే డివైడ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

  సాధారణంగా నాగార్జున సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అయితే ట్రైలర్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగార్జున లిప్ లాక్ సీన్లు చేయడం, రిలీజ్ తర్వాత రకుల్, ఝన్సీ మధ్య ఎవరూ ఊహించని విధంగా ముద్దు సీన్ ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీనికి తోడు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లపై తీవ్రమైన ప్రభావం పడింది.

  తొలివారం ఎంత వసూలు చేసింది?

  తొలివారం ఎంత వసూలు చేసింది?

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మన్మధుడు 2' మూవీ తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.05 కోట్లు వసూలు చేసింది. ఇది డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో సగం కంటే తక్కువే. నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొన్న వారికి యాభై శాతం నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది.

  బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్లేనా?

  బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయినట్లేనా?

  ‘మన్మధుడు 2' మూవీ రిలీజైన 4వ రోజే బక్రీద్ హాలిడే కలిసొచ్చింది. అయినప్పటికీ వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు. ఆగస్టు 15న విడుదలైన ఎవరు, రణరంగం చిత్రాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుండటంతో నాగార్జున మూవీ వైపు ఆసక్తి చూపే వారు కరువయ్యారని తెలుస్తోంది.

  ఏరియా వైజ్ ఫస్ట్ వీక్ రిపోర్ట్

  ఏరియా వైజ్ ఫస్ట్ వీక్ రిపోర్ట్

  ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 2. 40 కోట్లు, సీడెడ్ రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 90 లక్షలు, గుంటూరు 88 లక్షలు, ఈస్ట్ గోదావరి 48 లక్షలు, కృష్ణ రూ. 64 లక్షలు, వెస్ట్ రూ. 49 లక్షలు, నెల్లూరు రూ. 30 లక్షలు వసూలైంది. ఏపీ, తెలంగాణ రైట్ష్ రూ. 16.5 కోట్లకు అమ్ముడవ్వగా తొలివారంలో కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రికవరీ అయంది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్ ఏరియాలో రూ. 1 కోటి రాబట్టినట్లు తెలుస్తోంది.

  చివరకు రిజల్ట్ ఏం తేలిందంటే?

  చివరకు రిజల్ట్ ఏం తేలిందంటే?

  ప్రస్తుతం ఉన్న ఈక్వెషన్స్ ప్రకారం ఏ సినిమా అయినా తొలివారం 60 నుంచి 70 శాతం మించి పెట్టుబడి రికవరీ అయితే.... పుల్ రన్‌లో ఎలాగో అలా బ్రేక్ ఈవెన్ పాయింటును చేరుకుంటుందనే ఒక ఆశ ఉంటుంది. అయితే బక్రీద్, ఆగస్టు 15 రెండు హాలిడేస్ వచ్చినా ‘మన్మధుడు 2' మూవీ 50 శాతం కూడా రికవరీ కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని డిజాస్టర్‌గా పేర్కొంటున్నారు.

  గట్టక్కే పరిస్థితి కనిపించడం లేదు

  గట్టక్కే పరిస్థితి కనిపించడం లేదు

  ‘మన్మధుడు 2' డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఈ మూవీ మొత్తం రూ. 20.5 కోట్లకు‌పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టాలి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ ఈ చిత్రం ప్రస్తుతం మార్కెట్లో హిట్ టాక్‌తో దూసుకెళుతున్న చిత్రాలతో పోటీ పడుతూ అంత మొత్తం వసూలు చేయడం అసాధ్యమే.

  English summary
  Manmadhudu 2 has collected a distributor share of 9.05 Cr in first week. Manmadhudu 2 is a 2019 Telugu-language romantic comedy film, produced by Nagarjuna Akkineni, P.Kiran under Annapurna Studios, Anandi Art Creations, Viacom18 Motion Pictures banners and directed by Rahul Ravindran. It stars Nagarjuna Akkineni, Rakul Preet Singh in the lead roles and music composed by Chaithan Bharadwaj.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X