For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Masooda Collections: కోటిన్నరకు అమ్మితే.. వారంలో రికార్డు వసూళ్లు.. గాలోడును దాటేసిన మసూద

  |

  అన్ని జోనర్ల కంటే హర్రర్ థ్రిల్లర్ మూవీలకు విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. అందుకే ఆ తరహా చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాల్లో కామెడీని పెట్టేసి గాడి తప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్యూర్ థ్రిల్ కాన్సెప్టుతో వచ్చిన హర్రర్ మూవీనే 'మసూద'. వినూత్నమైన సబ్జెక్టుతో రూపొందిన ఈ సినిమా గత వారమే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి ఆదరణ లభించడంతో హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'మసూద' మూవీ వారం రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

  మసూదగా భయపెట్టాలని

  మసూదగా భయపెట్టాలని

  టాలెంటెడ్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'మసూద'. సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, శ్రీధర్, సత్యం రాజేష్ కీలక పాత్రలు పోషించారు.

  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్విట్టర్ రివ్యూ: నరేష్ మూవీకి టాక్ ఏంటి? సినిమా హిట్టా ఫట్టా?

  మసూద బిజినెస్ వివరాలు

  మసూద బిజినెస్ వివరాలు


  ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఈ నమ్మకంతోనే 'మసూద' మూవీ థియేట్రికల్ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్‌ను కలిపి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే విడుదల చేశారు.

  7వ రోజు ఎంత వచ్చింది?

  7వ రోజు ఎంత వచ్చింది?

  'మసూద' మూవీని తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వస్తున్నాయి. దీనికి మొదటి రోజు రూ. 75 లక్షలు గ్రాస్, రెండో రోజు రూ. 92 లక్షలు గ్రాస్, మూడో రోజు రూ. 1.48 కోట్లు గ్రాస్, నాలుగో రోజు రూ. 60 లక్షలు గ్రాస్, ఐదో రోజు రూ. 51 లక్షలు గ్రాస్, ఆరో రోజు రూ. 42 లక్షలు గ్రాస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఏడో రోజు దీనికి రూ. 32 లక్షలు గ్రాస్‌, రూ. 17 లక్షలు పైగా షేర్ వచ్చింది.

  హీరోయిన్ ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్: టాప్ తీసేసి.. అతడిపై వాలిపోయి!

  7 రోజులకు ఎంతొచ్చింది?

  7 రోజులకు ఎంతొచ్చింది?


  'మసూద' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో బాగానే రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది ఇప్పటి వరకూ నైజాంలో రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 53 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.97 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 7 రోజుల్లో రూ. 5.00 కోట్లు గ్రాస్, రూ. 2.65 కోట్లు షేర్ రాబట్టింది.

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు


  వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.00 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'మసూద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ కొంతమేర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 35 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో రూ. 5.35 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.83 కోట్లు షేర్‌ను వచ్చింది.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

  లాభాల బాటలో నడుస్తోంది

  లాభాల బాటలో నడుస్తోంది

  హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చిన 'మసూద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.30 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 2.83 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.33 కోట్లు లాభాలు వచ్చాయి. ఇది గాలోడు కంటే ఎక్కువే.

  English summary
  Masooda is a horror drama movie directed by Sai Kiran. This Movie Collects Rs 5.35 cr Gross in 1st Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X