»   » ఏప్రిల్ లో మెగా షో : మూడు సినిమాలు..షాకయ్యే కో ఇన్సిడెంట్

ఏప్రిల్ లో మెగా షో : మూడు సినిమాలు..షాకయ్యే కో ఇన్సిడెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా క్యాంప్ నుంచి వచ్చే హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. అందుకే వారు ధీమాగా ధియోటర్స్ లో దిగుతూంటారు. అయితే ఇంతవరకూ ఒక మెగా హీరో చిత్రం రిలీజ్ అయితే గ్యాప్ ఇచ్చి మరో హీరో వచ్చేవాడు. ఇఫ్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

మెగా క్యాంప్ నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు ఒకేసారి అంటే ఒకే నెలలో రంగంలోకి దిగుతున్నారు. అందులో మొదటిగా సాయిధరమ్ తేజ ఉన్నాడు. ఆ నెల ఏప్రియల్ నెల. ఈ నెలలో మూడు సినిమాలు మెగా హీరోలకు చెందినవే కావటం విశేషం. అంతేకాదు వీరి సినిమాల మధ్య ఓ సెంటిమెంట్ లాంటి కో ఇన్సిడెంట్ ఉంది. అదేంటో తెలియాలంటే స్లైడ్ షో చూడాల్సిందే.

మూడూ మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్న చిత్రాలే. ఈ మూడు చిత్రాలు ఒకేసారి రంగంలోకి దిగితే మెగా వార్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ధియోటర్స్ ఎక్కడ చూసినా ఆ క్యాంప్ కు చెందిన హీరో సినిమాలే కనిపిస్తాయి. అందుకు కారణం మూడూ పెద్ద సినిమాలే.

స్లైడ్ షోలో ...మెగా షో గురించి...

మొదటగా ...

మొదటగా ...

ఈ మెగా షోలో పాల్గొనేది మొదట సాయి ధరమ్ తేజ. అతని తాజా చిత్రం సుప్రీమ్ ..ఏప్రియల్ 1 న విడుదల కాబోతోంది.

హిట్ డైరక్టర్..

హిట్ డైరక్టర్..

మెగా క్యాంప్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ మాస్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా పటాస్ తో హిట్ కొట్టిన అనీల్ రావిపూడితో సుప్రీమ్ చిత్రం చేస్తున్నాడు.

నెక్ట్స్ ఈ షోలో

నెక్ట్స్ ఈ షోలో

ఇంకో మెగా హీరో పవన్ కళ్యాణ్. ఏప్రియల్ 8న పవన్ కళ్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతోంది.

చెప్పేదేముంది

చెప్పేదేముంది

సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేదేముంది.. ఆ క్రేజే వేరు.

మూడో హీరో

మూడో హీరో

మరో ప్రక్క అల్లు అర్జున్ సరైనోడు చిత్రం సైతం ఏప్రియల్ 22న వస్తోంది.

పక్కా మాస్

పక్కా మాస్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా మాస్ సినిమాగా రెడీ అయ్యింది.

సాయిధరమ్ తేజ స్ట్రాటజీ

సాయిధరమ్ తేజ స్ట్రాటజీ

సర్దార్ కు చిత్రం రిలీజ్ కు కరెక్టుగా వారం ముందు రిలీజ్ చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ. దిల్ రాజు నిర్మాత కావటంతో ఖచ్చితంగా పవన్ సినిమా రిలీజైనా ధియోటర్స్ సమస్య రాదని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

అంతేకాదు..

అంతేకాదు..

సాధారణంగా పవన్ వంటి పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ సమయాల్లో ఏ చిన్న హీరో కూడా తమ సినిమాలు ను విడుదల చేయరు. అందుకే ఆ వారాలు ధియోటర్స్ ఖాళీగా ఉంటూంటాయి సాధారణంగా. అది గమనించిన సాయి ధరమ్ ఆ వీక్ ని సద్వినియోగం చేసుకునేందుకే ఇలా చేసాడంటున్నారు.

మూడు కంటిన్యూ...

మూడు కంటిన్యూ...

ఇవన్నీ చూస్తూంటే నెలంతా మెగా మూడ్ కంటిన్యూ అయ్యేటట్లు ఉందని చెప్తున్నారు.

కో ఇన్సిడెంట్

కో ఇన్సిడెంట్

సర్దార్, సరైనోడు , సుప్రీమ్..మూడు సినిమాలు 'స' తో మొదలయ్యే చిత్రాలే. అంతేకాదు ఏప్రియల్ రిలీజు లే. మరొకటి ముగ్గురూ మెగా క్యాంప్ కి చెందిన వారే కావటం విశేషం.

English summary
"Supreme" tem is targeting an April 1st release and will not miss that date. In the wake of Sardaar hitting cinemas on 8th and Sarrainodu probably on 22nd of April, this sounds pretty interesting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu