Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya 8 Days Collections: కలెక్షన్స్ లలో కూడా పూనకాలు అస్సలు తగ్గట్లే.. మెగా బాస్ అరాచకం!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సంక్రాంతిలో మెగాస్టార్ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా పోటీకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి ఒకరోజు ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక మొత్తంగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఎనిమిది రోజుల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది? అలాగే ఎంత లాభాల్లో కొనసాగుతోంది? అనే వివరాల్లోకి వెళితే..

వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్
వాల్తేరు వీరయ్య సినిమా రేంజ్ కు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఓవర్సీస్ లో 9 కోట్ల వరకు ధర పలికింది. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా 88 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఫైనల్ గా వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లకు ఫిక్స్ అయింది.

8వ రోజు ఏపీ, నైజాం కలెక్షన్స్
వాల్తేరు వీరయ్య సినిమాకు ఫ్యాన్స్ నుంచి మొదటి రోజే పాజిటివ్ టాక్ అవడంతో రోజురోజుకు కలెక్షన్స్ మరింత పెరుగుతూ వెళ్ళాయి. ఇక ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఎనిమిదవ రోజు ఏరియాలవారిగా ఈ సినిమా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజంలో 1.25లక్షలు, సీడెడ్ లో 27 లక్షలు, ఉత్తరాంధ్ర 95 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు, గుంటూరులో 23 లక్షలు, కృష్ణ 24 లక్షలు, నెల్లూరులో 16 లక్షలు, షేర్ కలక్షన్స్ సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణలో మొత్తంగా ఈ సినిమా 8వ రోజు 3.85 కోట్ల షేర్ కలెక్షన్స్ 6.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

8 రోజుల టోటల్ కలెక్షన్స్
ఇక వాల్తేరు వీరయ్య సినిమా ఎనిమిది రోజుల్లో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 27.17 కోట్లు, సీడెడ్ లో 14.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.29 కోట్లు, ఈస్ట్ లో 8.5 కోట్లు, వెస్ట్ లో 4.86 కోట్లు, గుంటూరులో 6.43 కోట్లు, కృష్ణ లో 6.16 కోట్లు, నెల్లూరులో 3.17 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 83.71 షేర్ కలెక్షన్స్ 135.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ అందాయి. అక్కడ 6.40 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈసారి మెగాస్టార్ తన దూకుడు చూపించారు. అక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా చాలా వేగంగా 101.16 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకు 173.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ప్రాఫిట్స్ లో కొనసాగుతున్న వీరయ్య
ఇక మూవీ ఓవరాల్ బిజినెస్ అయితే 88 కోట్ల వరకు జరిగింది. అంటే సినిమా 89 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొత్తం షేర్ కలెక్షన్స్ 101 కోట్లు దాటడంతో ఇప్పుడు 12.16 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్స్ తో కొనసాగుతోంది. ఇదే ఫ్లోలో కొనసాగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరింత లాభాలు చేకూర్చే అవకాశం ఉంది.