»   » బాలకృష్ణనే టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

బాలకృష్ణనే టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా ఈ టీవీ వారి జబర్ధస్త్ లో బాలకృష్ణ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో ఓ ఎపిసోడ్ వచ్చి సూపర్ హిట్టైంది. అది నిజ జీవితంలో కాకపోయినా బాలకృష్ణ ఒక్కసారి రామ్ గోపాల్ వర్మ గురించి ఆలోచించే అవసరం ఏర్పడింది. ఆయన రౌడీ చిత్రాన్ని బాలకృష్ణ తాజా చిత్రం లెజండ్ పై వేస్తున్నారు. రెండూ మార్చి 28నే విడుదల చేయటానికి నిర్ణయించారు. రెండూ క్రేజీ ప్రాజెక్టులే కావటం విశేషం. ఒక సినిమాపై మరొకటి విపరీతంగా ప్రబావం చూపకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్టు ఉంటుందనేది నిజం.

బాలయ్య అభిమానులు లెజండ్ కు వెళితే, మంచు,వర్మ అభిమానులు అటు రౌడీకి వెళ్తారు. అవి కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతుంది. అలాగే థియోటర్స్ ని కూడా ఈ రెండు సినిమాలు పంచుకోవాల్సి వస్తుంది. అయితే ఎవరన్నా వెనక్కి తగ్గుతారేమో అంటే ఆ వాతావరణం కనపడటం లేదు. ఇప్పటికే లెజండ్ నిర్మాత అనీల్ సుంకర తమ చిత్రం రిలీజ్ డేట్ మార్చే అవకాసం లేదన్నట్లుగా తెలియచేసారు. అటు రౌడీ టీమ్ కూడా మార్చి 28నే ఎట్టి పరిస్దితుల్లో విడుదల చేయాలని చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉంది.

'రౌడీ' విషయానికి వస్తే మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో ఆడియో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని మోహన్ బాబు మీడియాకు తెలియచేసారు.

Mohan Babu's Rowdy, Balakrishna's Legend To Clash At Box Office

మోహన్ బాబు మాట్లాడుతూ... ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు

14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'. ఈ చిత్రం ఆడియో మార్చి 7న విడుదల అయ్యింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో ఇప్పుడు ఆన్ లైన్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అప్ లోడ్ చేసిన ఇరవైనాలుగు గంటల్లో రెండు లక్షలు హిట్స్ ని సాధించింది. దాంతో ఏ మేరకు క్రేజ్ ఉందనేది అర్దమవుతోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

English summary
Mohan Babu's Rowdy and Balakrishna's Legend are slated to release in theatres on March 28. The Ram Gopal Varma-directed gangster action film will lock horns with director Boyapati Srinu's movie at the Box Office, making it the biggest clash of summer 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu