»   » 3.5 కోట్లు బడ్జెట్...ఆరున్నర కోట్లు శాటిలైట్ రైట్స్

3.5 కోట్లు బడ్జెట్...ఆరున్నర కోట్లు శాటిలైట్ రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కేవలం మూడున్నర కోట్లు పెట్టుబడితో సినిమా తీస్తే...ఆ సినిమాకు శాటిలైట్ రైట్స్ ఆరున్నర కోట్లు రావటం అనేది మామూలు విషయం కాదు. మళయాళ సూపర్ హిట్ 'దృశ్యం' విషయంలో అది జరిగింది. అక్కడ లీడింగ్ ఛానెల్ ఏషియా నెట్ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ రేటు రావటం మళయాళ చిత్ర పరిశ్రమలో పెద్ద రికార్డ్. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. మరో ప్రక్క రిలీజైన మూడు వారాలకే 15 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇస్తోంది. మోహన్ లాల్ స్వంత బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ రీమేక్ అవబోతోంది.

Mohanlal's Drishyam Sold For Rs 6.5 Crores!

ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి కమల్‌ ఆసక్తి చూపుతున్నాడు. తెలుగులో వెంకటేష్ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీప్రియ దర్శకత్వంలో చిత్రం రూపొందనుంది. హీరోయిన్ మిగతా విషయాలు తేలాల్సి ఉంది. ఇక తమిళ వెర్షన్ లో మీనా నే హీరోయిన్ గా తీసుకోనున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మీనా దశ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది .

ఇక వెంకటేష్‌ సాధించిన విజయాల్లో రీమేక్‌ చిత్రాల పాత్రే ఎక్కువ. పరభాషల్లో విజయవంతమైన చిత్రాలను ఎంచుకొని వాటిల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోవలో తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నారు వెంకీ. మలయాళంలో ఆదరణ పొందిన 'దృశ్యం' తెలుగు పునర్నిర్మాణ హక్కుల్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సొంతం చేసుకొంది. రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, వైడ్‌ యాంగిల్‌ సంస్థలతో కలిసి తెలుగులో నిర్మించబోతోంది. వెంకటేష్‌ హీరోగా నటిస్తారు. ఈ చిత్రానికి నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపాయి సినిమా వర్గాలు.

English summary
Drishyam, as we all know, was the most successful movie for the year 2013. Now, the latest news is that Drishyam has been sold to Asianet, Malayalam's leading Television channel for a whooping amount of Rs 6.5 crores! Now, with this, Drishyam bags the record of having acquired the ever biggest satellite amount in Mollywood. Earlier, the remake rights of the movie was sold for Rs 1.55 crores. The total budget of the movie was Rs 3.5 crores. The movie has now received double the amount from its satellite rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu