»   » ఐఫా ఉత్సవం: మోస్ట్ పాపులర్ ఫోటో మూమెంట్స్

ఐఫా ఉత్సవం: మోస్ట్ పాపులర్ ఫోటో మూమెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తొలిసారిగా సౌత్‌‌లో నిర్వహించిన ‘ఐఫా ఉత్సవం' ఊహించిన దానికంటే ఎక్కువగానే గ్రాండ్ సక్సెస్ అయింది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమలకు సంబంధించి స్టార్స్ అంతా ఈ ఉత్సవంలో మెరిసారు. తెలుగు పరిశ్రమ నుండి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్స్ రావడంతో ఉత్సవం మరింత కలర్ ఫుల్ గా మారింది. ఇక తెలుగు స్టార్స్ రామ్ చరణ్, అఖిల్ డాన్స్ పెర్పార్మెన్స్ ఐఫా ఉత్సవానికే హైలెట్ గా నిలిచింది.

ఐఫా ఉత్సవానికి సంబంధించిన మరిన్ని ఫోటోలు, వార్తలు

ఐఫా గ్రీన్ కార్పెట్‌పై హీరోయిన్ల సెక్సీ సోయగాల ప్రదర్శన ఐఫా ఉత్సవానికి గ్లామర్ సొగబులు అద్దినట్లయింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఉత్సవం ముగిసిన కలిసి సెల్ఫీలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ లా వ్యాపించాయి.

ఈ వేడుకలో తెలుగు విభాగంలో మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషం. మొత్తం 12 క్యాటగిరీల్లో శ్రీమంతుడు 6 అవార్డులు సొంతం చేసుకోగా... బాహుబలి చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడుతో సహా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. భలే భలే మగాడివోయ్ చిత్రానికి గాను వెన్నెల కిషోర్ బెస్ట్ కమెడియన్ అవార్డు అందుకున్నారు.

తెలుగు విభాగం అవార్డుల కార్యక్రమానికి అల్లు శిరీష్, రెజీనా, నవదీప్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ ముగ్గురూ తమ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. ఐఫా ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలోనే టీవీలో ప్రసారం కానున్నాయి. స్లైడ్ షోలో ఐఫా ఉత్సవంలో మోస్ట్ పాపులర్ ఫోటో మూమెంట్స్‌కు సంబంధించిన దృశ్యాలు...

రెజీనా

రెజీనా


ఐఫా ఉత్సవంలో రెజీనా ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయింది. ఈ డ్రెస్సులో ఆమె తన అందానికి మరింత సెక్సీ నెస్ అద్దింది అనడంలో సందేహం లేదు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి


ఐఫా ఉత్సవంలో రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అనంతరం ఇలా తన తండ్రి చిరంజీవి నుండి ప్రశంసలు అందుకున్నారు.

బర్త్ డే పార్టీ

బర్త్ డే పార్టీ


ఐఫా ఉత్సవం సందర్భంగా 25వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత రవితేజ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన హీరోయిన్లతో ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు.

సాయి ధరమ్-రెజీనా

సాయి ధరమ్-రెజీనా


సాయి ధరమ్, రెజీనా మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం ఉంది. అయితే ఈ వార్తలను వాను ఆ మధ్య ఖండించారు. అయితే ఐఫా ఉత్సవంలో వీరి వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది.

సెల్పీ టైం

సెల్పీ టైం


రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన...... అఖిల్ తో కలిసి సెల్ఫీ. రవితేజ బర్త్ డే పార్టీ సందర్బంగా కారా వ్యాన్ లో ఈ సెల్ఫీ తీసారు.

మహేష్ బాబుతో తమన్నా

మహేష్ బాబుతో తమన్నా


మహేష్ బాబుతో కలిసి సెల్పీ తీసుకుంటున్న హీరోయిన్ తమన్నా...

శృతి హాసన్ హాట్ లుక్

శృతి హాసన్ హాట్ లుక్


ఐఫా ఉత్సవంలో హీరోయిన్ శృతి హాసన్ హాట్ లుక్ తో దర్శనమిచ్చింది.

మహేష్-నమ్రత

మహేష్-నమ్రత


ఐఫా ఉత్సవంలో మహేష్ బాబు, నమ్రత గుసగుసలు...

అల్లు శిరీష్


ఐఫా ఉత్సవం తర్వాత పార్టీలో రామ్ చరణ్ తో కలిసి అల్లు శిరీష్ పార్టీ.

English summary
IIFA Utsavam turned out to be a huge success than expected, with many of the top stars turning up for the event. It is one of those rare events graced by all four senior stars, Chiranjeevi, Nagarjuna, Balakrishna and Venkatesh. Needless to say it garnered great attention with star performances of Ram Charan and Akhil Akkineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu