»   » ఎంఎస్.ధోనీ మూవీ.... బాక్సాఫీస్ పరిస్థితేంటి? ఎంత వసూలు చేసింది?

ఎంఎస్.ధోనీ మూవీ.... బాక్సాఫీస్ పరిస్థితేంటి? ఎంత వసూలు చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎంఎస్.ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ'. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకె్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న హిందీ, తమిళం, తెలుగులో గ్రాండ్ గా రిలీజైంది.

ఇండియాలో ఈ చిత్రాన్ని దాదాపు 3వేల థియేటర్లలో రిలీజ్ చేసారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా, కెప్టెన్ గా ఎదిగిన వైనాన్ని, ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉన్న నేపథ్యంలో సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

తొలి రోజు ఎంత వసూలైంది?

తొలి రోజు ఎంత వసూలైంది?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ పాత్రలో నటించిన ఈ చిత్రానికి తొలి రోజు మాసివ్ ఓపెనింగ్స్ వచ్చాయి. రూ. 21.30 కోట్లు వసూలు చేసింది. సినిమాలో సూపర్ స్టార్లు లేక పోయినా ధోనీ మీద ఉన్న క్రేజే ఇంత భారీ మొత్తం వసూలు చేసింది.

2016లో సెకండ్ ప్లేస్

2016లో సెకండ్ ప్లేస్

2016లో భారీ ఓపెనింగ్స్ సాధించిన రెండో చిత్రంగా ‘ఎంఎస్. ధోనీ' మూవీ నిలిచింది. ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్' మూవీ తొలి స్థానంలో ఉండటం గమనార్హం.

60% ఆక్యుపెన్సీ

60% ఆక్యుపెన్సీ

తొలి రోజు సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో 60 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. విడుదలైన తొలిరోజే మంచి టాక్ రావడంతో వీకెండ్ వరకు వసూళ్లు మరింత పెరగడంతో పాటు, ఆక్యుపెన్సీ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది

పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది

సినిమా వసూళ్లకు సంబంధించి ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది, తమిళం, తెలుగులో ఏ మేరకు రాబట్టింది అనే పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది.

English summary
Sushant Singh Rajput's M S Dhoni The Untold Story takes a massive opening of 21. 30 cr, to become the second highest opener of 2016. The film saw 60 percent occupancy across the country which is really big.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu