For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాబాయ్ పవన్ కోసం డేట్ మార్చుకున్నాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : అటు బాబాయ్ గోపాల గోపాల చిత్రం, ఇటు అబ్బాయి ముకుందా చిత్రం రెండూ భాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండూ సంక్రాంతికే విడుదల చేయటానికి మొదటి నిర్ణయించాడు. అయితే బాబాయ్ తో క్లాష్ ఎందుకుని అబ్బాయి అనుకున్నట్లున్నాడు... ముకుందా తేదీ కొంచెం ముందుకు తెచ్చారు. ముకుందాని డిసెంబర్ 25 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  వరుణ్‌తేజ్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

  దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

  Mukunda will Hit Screens on December 25th

  నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్‌తేజ్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.'' అన్నారు. మిగిలిన ఓ పాటని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌ వేసి తెరకెక్కిస్తామన్నారు నిర్మాతలు.

  గోపాల గోపాల విషయానికి వస్తే...

  తెలుగులో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఇది. వెంకటేష్, పవన్‌కళ్యాణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ‘తడాఖా' ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన పనులన్నీ వేగవంతం చేశారు. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదలకానుంది. ఆడియోను డిసెంబర్‌లో విడుదల చేయడాలని సన్నాహాలు చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా శ్రేయ నటిస్తోంది.

  బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయని నిర్మాతలు తెలిపారు. వెంకటేష్, పవన్‌కళ్యాణ్ కలిసి నటిస్తుండటంతో ఇద్దరి అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.

  English summary
  As expected earlier, the Srikanth Addala directorial that marks the debut of Nagababu’s son's Mukunda will hit screens on December 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X