»   » 'ఊపిరి': ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మాటేంటి?ఏ ఏరియా వీక్?

'ఊపిరి': ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మాటేంటి?ఏ ఏరియా వీక్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అక్కినేని నాగార్జున, కార్తి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రిలీజైన మార్నింగ్ షో నుంచీ సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కడా నెగిటివ్ టాక్ అనేది కనపడలేదు. ముఖ్యంగా 'ఊపిరి' ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక మంచి మూవీగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ టాక్ తోనే ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మరి కలెక్షన్స్ మాట ఎలా ఉంది అనేది ఇక్కడ చూద్దాం.

అందుతున్న సమాచారం ప్రకారం అన్ని సెంటర్ల నుంచీ ఈ చిత్రం మొదటి సమ్మర్ హిట్ గా డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొంటున్నారు. దాదాపు ఎనిమిది కోట్లు ఫస్ట్ వీకెండ్ లో కలెక్ట్ చేసిందని సమాచారం. మొదటి మూడు రోజుల్లోనే ఈ స్దాయి కలెక్షన్స్ రాబట్టడం మాటలు కాదని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.


Also Read: 'వూపిరి' రిజల్ట్ ట్విస్ట్: ప్లాఫా.. కార్తీ గోలెత్తిపోతున్నాడు?, మహేష్ మాట్లాడాడు


కేవలం డొమెస్టిక్ మార్కెట్ లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్ లోనూ ఈ మూవీ మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ పంపిణీదారులను ఆనందంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా యూఎస్ లో 'ఊపిరి' సినిమాకి మంచి ప్రేక్షక ఆధరణ దక్కిందని అంటున్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈ మూవీ ఓవర్సీస్ లో దాదాపు $904K పైగా వసూళ్లను సాధించిందని అంటున్నారు. ఫుల్ రన్ లో $1.5 మిలియన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


ఏరియా వైజ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూద్దాం... (షేర్):


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 2.84కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి సూపర్బ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 1.39 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 77 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.



గుంటూరు

గుంటూరు

గుంటూరు...మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 75 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.



ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 62 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.



పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

వెస్ట్ గోదావరి...మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 47 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.


కృష్ణా

కృష్ణా

కృష్ణా జిల్లాలో ..మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 67 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ...మొదటి మూడు రోజుల్లో ఊపిరి సినిమా 28 లక్షల రూపాయల షేర్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.


ఆంధ్రా, తెలంగాణా

ఆంధ్రా, తెలంగాణా

మొత్తం ఊపిరి చిత్రం ఆంధ్రా,తెలంగాణాలలో కలిపి మొదటి మూడు రోజుల్లో 7.79 కోట్లు సంపాదించింది.



నిడివి ఎక్కువైనా..

నిడివి ఎక్కువైనా..

2 గంటల 33 నిమిషాల నిడివి ఉన్నా సినిమాలో ఫన్ సీన్స్ తో పాటు, బలమైన భావోద్వేగంతో ప్రేక్షకుల ఆకట్టుకోవడం లో విజయం సాధించడంతో రోజు రోజుకీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.


English summary
'Oopiri' collected a share of nearly Rs 8 crore in the Telugu states so far.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu