For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెర్రీ గోల్డెన్ ఛాన్స్ మిస్సవటమే చైతూకు కలిసి వచ్చింది,ఎలాగంటే

  By Srikanya
  |

  హైదరాబాద్: దసరా, సంక్రాంతి వంటి హాలీడేస్ లో సినిమాలు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఎప్పుడూ గొప్పదే. నిజానికి ఆ రోజుల్లో ఎప్పుడూ పెద్ద సినిమాలు రిలీజ్ ఉండటంతో చిన్న సినిమాలకు దారి ఏర్పడదు. ఈ దసరాకు పేరుకు ఐదు సినిమాలు రిలీజ్ అయినా లీడ్ ఉన్నది మాత్రం ప్రేమమ్ చిత్రమే.

  నిజానికి ..రామ్ చరణ్ ధృవ చిత్రం ఈ దసరాకు మొదట ప్లాన్ చేసారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది పోయి, కేవలం టీజర్ మాత్రమే బయిటకు వచ్చింది. అదే ఈ సీజన్ లో ధృవ వచ్చి ఉంటే దుమ్ముదులిపేది అంటున్నారు ఆ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరూ.

  'మలర్ ' మిస్సైంది కానీ...మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది (చైతూ 'ప్రేమమ్'రివ్యూ )

  ఇక అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ప్రేమమ్' గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన విడుదలై హిట్ దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. మొదటి రోజునుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికే అంతటా మంచి ఓపెనింగ్స్ సాధించగా, దసరా సెలవుల్లో కూడా కలెక్షన్స్ అదే స్థాయిలో ఉన్నాయి.

  మొదట వారాంతం షేర్, గ్రాస్ ఎంతంటే

  మొదట వారాంతం షేర్, గ్రాస్ ఎంతంటే

  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా, అందులో 9.15 కోట్లు గ్రాస్ వచ్చింది. నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీకెండ్ గా దీన్ని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటే రిలీజైన మిగతా సినిమాలేవీ ఈ స్దాయిలో కాదు కదా దగ్గరగా కూడా కలెక్ట్ చేయటం లేదు.

  ఎదురేలేకుండా పోయింది

  ఎదురేలేకుండా పోయింది

  దసరా సెలవులు ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. అలాగే వచ్చే వారాంతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాంగ్‌రన్‌లో నాగ చైతన్య కెరీర్‌కు ప్రేమమ్ సోలో హీరోగా పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

  నైజాం లో ప్రేమమ్ కలెక్షన్స్

  నైజాం లో ప్రేమమ్ కలెక్షన్స్

  చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఫస్ట్ వీకెండ్ 2.32 కోట్లు వసూలు చేసి , డిస్ట్రిబ్యూటర్స్ ని ఆనందపరిచింది.

  సీడెడ్ ప్రాంతంలో ప్రేమమ్ ఎంతంటే

  సీడెడ్ ప్రాంతంలో ప్రేమమ్ ఎంతంటే

  మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సీడెడ్ ప్రాంతంలో ఫస్ట్ వీకెండ్ 0.90 కోట్లు వచ్చింది.

  ఉత్తరాంద్రలో ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్

  ఉత్తరాంద్రలో ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్

  వాస్తవానికి మళయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్'రీమేక్ చేయాలనుకోవటం అతి పెద్ద సాహసం. ఎందుకంటే అందరూ ఒరిజనల్ తో పోల్చి చూడటానికి ఆసక్తి చూపెడతారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ని ప్రేమమ్ మళయాళ అభిమానులు చీల్చి చెండాడేసారు. ఓ రేంజిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసారు. అయితే ఆ విషయంలోనే తెలుగు ప్రేమమ్ సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం ఉత్తరాంధ్రలో .... 0.75 కోట్లు కలెక్ట్ చేసింది.

  కృష్ణాలో ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్..

  కృష్ణాలో ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్..

  దర్శకుడు చందు మొండేటి ఒరిజనల్ సినిమాలోని సోల్ ను తీసుకుని, తనదైన శైలిలో నేటివిటిని,ఫన్ ని, ఫ్యాన్ ఎలిమెంట్స్ ని అద్దుతూ రీరైట్ చేసి సినిమా చేసాడు. ఆ విషయంలో చందు వందకు వెయ్యి మార్కులు వేయించుకున్నారు. కృష్ణా జిల్లాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ 0.55 కలెక్ట్ చేసింది.

  గుంటూరు ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

  గుంటూరు ప్రేమమ్ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

  అయితే మళయాళంలో ఉన్న మ్యాజిక్ 'మలర్' పాత్ర. దాన్ని మాత్రం తెలుగులోకి అంతే సమర్దవంతంగా పట్టుకుని రాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. అయితే చైతూ కూడా తన నిజ జీవితంలో ప్రేమ ఫేజ్ లో ఉండటం వలనో ఏమో కానీ ఎప్పుడూ లేనంత బాగా సీన్స్ పండించిదాన్ని దాటే ప్రయత్నం చేసాడు. గుంటూరు లో ఈ చిత్రం 0.61 కోట్లు కలెక్ట్ చేసింది.

  తూర్పు గోదావరి ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

  తూర్పు గోదావరి ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

  ప్రేమమ్ సినిమాలో నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పటమే కాకుండా ఓ పాత్రను కూడా పోషించాడు. అలాగే వెంకటేష్ సైతం ఓ పాత్రలో వచ్చి దడదడాలించాడు. వీళ్లద్దరి పాత్రలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈస్ట్ గోదావరి లో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ 0.53 కోట్లు కలెక్ట్ చేసింది.

  వెస్ట్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..

  వెస్ట్ గోదావరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..

  సినిమాలో హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ల నటన ఆసక్తికరంగా బాగుంది. మడోనా సెబాస్టియన్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది. వెస్ట్ గోదావిరి ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ... 0.39 కోట్లు కలెక్ట్ చేసింది.

  నెల్లూరు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

  నెల్లూరు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

  ఈ చిత్రంలో శృతి హాసన్ ని ఒరిజనల్ లోని పాత్రతో పోల్చి చూడకపోతే బాగుందనిపిస్తుంది. శృతి తన శక్తి మేరకు బాగానే చేసింది. ముఖ్యంగా డాన్స్ చేసి చూపించేటప్పుడు శృతి చాలా బాగా చేసింది. అనుపమ పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయిని గుర్తుకు తెస్తుంది. నెల్లూరు ఏరియా ఫస్ట్ వీకెండ్ 0.27 కోట్లు వసూలు చేసింది.

  ఆంధ్రా, నైజం కలిసి

  ఆంధ్రా, నైజం కలిసి

  ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే ఈ కథ కేవలం తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ,మనందరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన పాయింటే ఈ సినిమాకు హైలెట్, అదే ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం ఏపి, నైజాం ఏరియాల కలెక్షన్స్ కలిపి 6.32 కోట్లు వసూలు చేసింది.

  వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్

  వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్

  చందు మొండేటిలో మంచి దర్శకుడు మాత్రమే కాదు ..అంతకు మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలటం కలిసొచ్చే అంశం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 9.15 కోట్లు (ఇందులో USA: Rs 1.73 కోట్లు, కర్ణాటక: Rs 0.70 కోట్లు, దేశంలో మిగిలిన ప్రాంతాలు: Rs 0.40 కోట్లు)

  ఈ టీమే ఇంత కలక్షన్స్ తెచ్చి పెట్టింది

  ఈ టీమే ఇంత కలక్షన్స్ తెచ్చి పెట్టింది

  బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

  నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్, చైతన్యకృష్ణ, జోష్ రవి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, జీవా.నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో), వైవాహర్ష తదితరులు

  కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌

  సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌

  ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని

  కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

  నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ

  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.

  విడుదల తేదీ: 7-10-2016

  English summary
  'Premam' has set the cash registers ringing at the Box Office. It collected a Gross of Rs 15 crore and Share of Rs 9.15 crore in the first weekend. That's a pretty good figure considering the opposition from five other flicks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X