»   » నాగచైతన్య రెమ్యుషనేషన్ అంతా?

నాగచైతన్య రెమ్యుషనేషన్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదటి చిత్రం జోష్ ప్లాప్, ఆ తర్వాత వచ్చిన ఏ మాయ చేసావో, 100% లవ్ చిత్రాలు డైరక్టర్స్ కే పేరుతెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ చిత్రం దడ చూసిన వారికి దడ తెప్పించింది.ఇలా కెరీర్ లో తన పేరు చెప్పి ఒక్క హిట్టు సంపాదించుకోకపోయినా నాగచైతన్య మాత్రం తన రెమ్యునేషన్ ని మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. అతని తండ్రి నాగార్జున ఈ విషయాలన్నీ దగ్గరుండి చూసి తన కొడుకు కెరీర్ ని ఓ దార్లో పెట్టి డబ్బు సంపాదించే మార్గం చూస్తన్నాడు. ఈ విషయం మీడియావారు నాగచైతన్య వద్ద ప్రస్దావించగా..తెలివిగా ఆ విషయం ఎత్తకుండా...ఎంతస్తారనేదానికన్నా నేను ఎక్కడ స్క్రిప్టుకి, సినిమాకు పనిచేసే టీమ్ కి ప్రాధ్యాన్యత ఇస్తాను అన్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య గగనం రాధా మోహన్ తో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది.ఇప్పటికే నాగచైతన్యని,నాగార్జున ని కలిసిన రాధా మోహన్ స్టోరీ లైన్ వినిపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. సెన్స్ బుల్ గా నడిచే డ్రామాతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.ప్రస్తుతం నాగచైతన్య రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ చిత్రంలో చేస్తున్నారు.

అనంతరం ప్రస్దానం దర్శకుడు దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. బెజవాడ చిత్రంని అక్టోబర్ 21 న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఇక ఈ చిత్రం ఎనభైల్లోనూ,తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్,యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది. నాగచైతన్య 'బెజవాడ"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా నాన్న ఫేమ్ అమలా పౌల్ ని ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

English summary
“More than the pay cheque, its an exciting script and the team that beckons me,” points out Naga Chaitanya, barely few years old in the industry with a price tag already escalated from Rs 3 crore to Rs 5 crore.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu