Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రీషూట్ లు అయ్యాయి... రిలీజ్ డేట్ ఇదిగో
హైదరాబాద్ : సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమాను నిర్మిస్తున్న . ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ , కొన్ని పాటలు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనా రీషూట్ లు చేసారని అందుకే లేటయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. పూర్తైన రషెష్ చూసిన నాగార్జున, నాగ చైతన్య కొన్ని సూచనలు చేసారని, అందుకు తగినట్లు దర్శకుడు రీషూట్ లు చేసారని చెప్పుకుంటున్నారు. దాంతో అవుట్ ఫుట్ సంతృప్తికరంగా వచ్చి రిలీజ్ డేట్ ని నిర్ణయించారని తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సినిమాను మార్చి 20వ తేదిన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు ‘దోచేయ్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, నిర్మాతల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

చైతన్య సరసన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ తరహా జోనర్ లో చైతన్య సినిమా చేయడం ఇదే తొలిసారి. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కానుంది.
''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్ వర్మ. కృతి సనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ-‘ అత్తారింటికి దారేది తర్వాత మా బ్యానర్‌లో స్వామిరారా టెక్నిషియన్స్‌తో చేస్తున్న సినిమా ఇది. నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, మరియు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. నాగచైతన్య చాలా డెటికేటెడ్ ఆర్టిస్ట్. స్టైలిష్‌గా ఉండే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. నాగచైతన్య మూవీలో బెస్ట్ మూవీ అవుతుంది. ఆడియన్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా బాగా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు తప్ప టోటల్ టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో ఒక థ్రిల్లింగ్ ఛేజ్ జరుగుతోంది'. అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్., ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్., ఆర్ట్: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.