»   » మూడు ప్లాపే...ఆ ఒక్కటే నిలబడింది(ట్రేడ్ టాక్)

మూడు ప్లాపే...ఆ ఒక్కటే నిలబడింది(ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రింతం వారం రిలీజైన మూడు చిత్రాలు('సాధ్యం", 'హైస్కూల్", 'గజదొంగలు") రిలీజయ్యాయి. వీటిల్లో జగపతి బాబు, ప్రియమణి జంటగా నటించిన 'సాధ్యం" సెక్సీ పోస్టర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుని ఓపినింగ్స్ సంపాదించుకుంది..అలాగే కిరణ్‌ రాథోడ్, కార్తీక్ ప్రధాన పాత్రదారులుగా 'హైస్కూల్"కూడా ఓ ప్రక్క మెసేజ్ చిత్రమంటూనే మసాజ్ చిత్రంలా పబ్లిసిటీ చేసారు. ఓ మాదిరిగా జనం వచ్చారు. వీటి మధ్య డూప్ హీరోలు నటించిన 'గజదొంగలు" అసలు ఎవరికీ తెలియని రీతిలో రిలీజైంది. అయితే టోటల్ గా ఈ మూడు చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. పెళ్ళయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు అనంతరం హ్యాట్రిక్ గా ప్రియమణి, జగపతి బాబులతో వచ్చిన చిత్రం కథ ధ్రిల్లర్ అంటూనే ఎవరికీ అర్ధం కాని విధంగా కథనం సమకూర్చటంతో అర్దం పర్ధం లేని చిత్రమై కూర్చుంది. ఇక 1940 ఓ గ్రామం తో అవార్డు సొంతం చేసుకున్న నరసింహ నంది ఈ సారి చీప్ గా పూర్తి మసాలా చిత్రంలా 'హైస్కూల్" ని విడుదల చేసి అతని ఆలోచనలు ఎల్.కే.జీ దగ్గరే ఆగిపోయినట్లు అనిపించుకున్నాడు. అలాగే 'గజదొంగలు" ప్రేక్షకుల టిక్కెట్ల డబ్బుని నిలువు చేస్తూండటంతో ఎవరూ అటువైపుకు వెళ్ళటం లేదు. ఇదిలా ఉంటే అంతకు ముందు వారం రిలీజైన నాగచైతన్య 'ఏ మాయ చేసావె" కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. అలాగే నిఖిల్ నటించిన 'కళవర్ కింగ్" బి, సి సెంటర్లలో ఫరవాలేదనిపించుకుంటూంటే, రాజా 'ఇంకోసారి" చిత్రం ధియోటర్స్ లో లేకుండా పోయింది. ఉన్న కొద్ది చోట్లా జనం లేకుండా పోయారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X