»   » ఈ వారం హిట్టు చిత్రం అదే (ట్రేడ్ టాక్)

ఈ వారం హిట్టు చిత్రం అదే (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం నాలుగు చిత్రాలు రిలీజైతే అందులో ఒకటి హిట్ టాక్ తెచ్చుకుంటే మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మిగతావి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని ధియోటర్స్ నుంచి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యాయి. ఇక ఈ నాలుగులో మొదట స్దానంలో హిట్ గా నిలిచిన నాగచైతన్య, గౌతమ్‌మీనన్ ల 'ఏమాయ చేసావె" నిలుస్తుంది. ఎ, మల్టీఫ్లెక్స్ ఫిలిం అని టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మంచి ఊపుమీద ఉన్నాయి. ఇక రాజా హీరోగా చేసిన 'ఇంకోసారి" మరీ స్లోగా ఉందని అయితే నీట్ గా తీయటంతో కొన్ని వర్గాలుకు నచ్చుతోంది. అయితే టాక్ వచ్చి చూద్దామనుకునేలోగా ధియోటర్స్ లో లేకపోవటం దీని మైనస్. నిఖిల్ 'కళవర్‌కింగ్", అల్లరి నరేష్ 'రాంబాబుగాడి పెళ్లాం" కలెక్షన్స్ యావరేజ్ కన్నా తక్కువ స్ధాయిలో ఉన్నాయి. అలాగే గతవారం విడుదలైన 'జాయ్" చిత్రం అస్సలు ఎక్కుడందో తెలియని స్దితి అయితే రానాని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల 'లీడర్" చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అయినా ధియోటర్స్ మాత్రం పెద్దగా డ్రాప్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu