»   » 150 స్క్రీన్స్ పెంచుతున్నారు

150 స్క్రీన్స్ పెంచుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా కలెక్షన్స్ లో తన మ్యాజిక్ ని కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.

డిమాండ్ మేరకు 150 ధియోటర్స్ పెంచుతున్నారు.నైజాంలో రిలీజ్ చేసిన సునీల్ నారంగ్ ...మాట్లాడుతూ..కేవలం 120 ధియోటర్స్ కు మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేసామన్నారు. అయితే ఇప్పుడు అక్కడ 55 ధియోటర్స్ పెంచుతున్నామన్నారు. అలాగే నైజాంలో ఆరు రోజుల్లో 5.20 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు.


 Nagarjun's Soggadu : 150 screens added

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

English summary
Soggade Chinni Nayana is still continuing its great run. From today onwards another 150 screens will be added.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu