twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Ghost day 1 collections నాగార్జున మూవీకి ఊహించని ఓపెనింగ్స్.. ది ఘోస్ట్ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ సినిమాను క్రేజీగా మలిచాయి . దాంతో వరల్డ్ వైడ్‌గా బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్


    నాగార్జున నటించిన బంగార్రాజు, ప్రవీణ్ సత్తారు రూపొందించిన గురుడవేగ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్‌కు క్రేజీగా మారింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. నైజాంలో ఈ చిత్రం 5.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్లు బిజినెస్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 16 కోట్ల మేర బిజినెస్ నమోదైంది. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 65 లక్షలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్ల మేర బిజినెస్‌ను వ్యాల్యూ చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా థియేటర్ కౌంట్

    ప్రపంచవ్యాప్తంగా థియేటర్ కౌంట్


    ఇక ప్రవీణ్ సత్తారు, నాగార్జున కలయికలో వచ్చిన ది ఘోస్ట్ క్రేజీ ప్రాజెక్టుగా నిలవడంతో భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 140 థియేట్లు, సీడెడ్‌లో 80, ఆంధ్రాలో 190, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 90, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లతో మొత్తం 700 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. నాగార్జున కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా ది ఘోస్ట్ ఘనతను సాధించింది.

    తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ

    తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ


    ది ఘోస్ట్ చిత్రం తెలుగు వెర్షన్ అక్యుపెన్సీ యావరేజ్‌గా నమోదంది. కాకినాడలో 71 శఆతం, వైజాగ్‌లో 63 శాతం, గుంటూరులో 62 శాతం, విజయవాడలో 49 శాతం, చెన్నైలో 60 శాతం, హైదరాబాద్‌లో 33 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మిగితా ప్రాంతాల్లో 30 శాతం కంటే తక్కువగా నమోదైంది.

    తమిళంలో ప్రభావం చూపిన ది ఘోస్ట్

    తమిళంలో ప్రభావం చూపిన ది ఘోస్ట్


    ఇక ది ఘోస్ట్ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చెన్నైలో 23 శాతం, కోయంబత్తూరులో 27 శాతం, కోచిలో 10 శాతం, త్రివేండ్రంలో 8 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఇలా..

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఇలా..


    ది ఘోస్ట్ సినిమా విషయానికి వస్తే.. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. దాంతో తొలి రోజు కలెక్షన్లు మోస్తారుగానే నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల షేర్, 10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్‌లో 125 లోకేషన్లలో 270 షోల ద్వారా 7 వేల డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల నుంచి 7 కోట్ల మధ్య షేర్ వసూలు చేసే అవకాశం ఉంది.

    ది ఘోస్ట్ లాభాల్లోకి రావాలంటే?

    ది ఘోస్ట్ లాభాల్లోకి రావాలంటే?


    ది ఘోస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 21 కోట్లకుపైగానే నమోదైంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 22 కోట్లుగా నిర్ణయించారు. లాంగ్ వీకెండ్ ఉండటం, హాలిడేలు కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి., దాంతో మౌత్ టాక్ పెరిగితే.. ఈ సినిమా తొలి వారాంతంలో బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.

    English summary
    Tollywood's star hero Nagarjuna Akkineni's The Ghost has arrived in Theatres on October 5th. Here is the day 1 estimated collecitons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X