»   » అదిరిపోయే రేంజిలో నాగార్జున 'రగడ' సినిమా కలెక్షన్స్

అదిరిపోయే రేంజిలో నాగార్జున 'రగడ' సినిమా కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రగడ సినిమా 13 రోజులకు 19 కోట్ల 17 లక్షలు షేర్‌ వచ్చింది. గుంటూరు, నైజాం తదితర ప్రాంతాల్లో ఊహించని విధంగా సక్సెస్‌ అయింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారు నిర్మాత శివప్రసాద్‌ రెడ్డి. నాగార్జున హీరోగా వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఫ్యాన్స్ ‌కు పండుగ లాంటి సినిమా. అందుకే త్వరలో హైదరాబాద్ ‌లో అందరినీ పిలిపించి విజయోత్సవ సభ చేయబోతున్నామని చెప్పారు. నాగార్జున ప్రస్తుతం విదేశాల్లోఉన్నారు గనుక ఆయన వచ్చిన తర్వాత అంటే 11వ తేదీ తర్వాత విజయోత్సవ సభ ఉంటుందని అన్నారు. అయితే నిర్మాత చెప్పిన విధంగా కలెక్షన్స్ లేవని, సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఏ చిత్రాలు పోటీలో లేకపోవటంతో యావరేజ్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu