»   » నాగార్జున కొత్త చిత్రం కేడీ ఫైనల్ రిజల్ట్?

నాగార్జున కొత్త చిత్రం కేడీ ఫైనల్ రిజల్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, మమతా మోహన్ దాస్ కాంబినేషన్లో నూతన దర్శకుడు కిరణ్ రూపొందించిన కేడీ చిత్రం ఫైనల్ గా ఫ్లాఫ్ టాక్ తో సెటిలయింది. మొదటి రోజు ఫరవాలేదు అని కొందరన్నా తర్వాత అది డిజాస్టర్ అని, పెద్ద ప్లాఫ్ అని ప్రేక్షకులు డిసైడ్ చేసేసారు. ఆ మేరకు కలెక్షన్స్ కూడా డ్రాప్ అవటం జరుగుతోంది. అయితే కొత్త దర్శకుడుకి ఎంకరేజ్ మెంట్ ఇస్తూ నాగార్జున అవకాశమిచ్చినా వినియోగించుకోలేకపోయాడనే టాక్ అంతటా వినపడుతోంది. అసలు ప్రస్తుతం ఆర్దిక మాధ్యం, తెలంగాణ,సమైఖ్యాంద్ర వంటి గొడవలతో పరిశ్రమ ఏమౌతుందో, ఏ షూటింగ్ ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్ధితుల్లో సినిమా రావటమే గొప్ప అని అది నిలబెట్టుకోలకపోవటం దురదృష్టమని వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త తరహా స్క్రీన్ ప్లే పేరుతో స్లమ్ డాగ్ మిలియనీర్ తరహా కథనాన్ని ఇక్కడ రుద్దాలని ప్రయత్నించాడని అదే బెడిసి కొట్టిందని, అలాగే హిందీ సినిమా లక్కీ ఓయ్ లక్కీ నుంచి ఎపిసోడ్స్ ఎత్తటం కూడా కథకు పనికిరాకుండా పోయిందని చెప్తున్నారు. ఎంతలా అనుకున్నా కథకు ఓ ప్రతినాయకుడో, ప్రతి కూల శక్తో అవసరమని అది కూడా సినిమాలో కరువయ్యిందని, ఎవరు మెయిన్ విలనో అర్ధం కాదని చూసినవాళ్ళు వాపోతున్నారు. అలాగే హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ పాత్ర మరీ ఘోరంగా ఉందని, వేరే వారితో బిడ్డల్ని కని నాగార్జున సరసన చేరే ఆమె పాత్ర తలనొప్పి తెప్పించే అంసమని అంటున్నారు. నాగార్జున అభిమానులు సైతం ఆయన గ్లామర్ ని మెచ్చుకుంటున్నారే కాని ఆ సినిమా జోలికి పోవటానికి ఆసక్తి చూపటం లేదు. దీనికన్నా ఇదే బ్యానర్ లో నాగార్జునతో వచ్చిన కింగ్ చిత్రం మేలని అంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu