»   » కోట్లు కురుస్తున్నాయి... ధాంక్స్

కోట్లు కురుస్తున్నాయి... ధాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్కినేని కుటుంబ తాజా చిత్రం మనం కు వస్తున్న రెస్పాన్స్ కు నాగార్జున ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. యుఎస్ లో ఈ చిత్రం కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది. దాంతో ఆయన తమ సినిమాని ఆదరిస్తున్న అభిమానులందిరకీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ... ఎఎన్నార్ లైవ్స్ ఆన్... మీరు పంచిన ప్రేమకి, చూపిస్తున్న ఆదరానికి ధాంక్స్ చెప్పుకోవటానికి మాటలు సరిపోవు, మీ నాగార్జున అన్నారు. అంతేకాకుండా యుఎస్ లో గురువారం రాత్రి, శుక్రవారం, శనివారం మొత్తం కలిపి వచ్చిన కలిసి 3.33 కోట్లు వచ్చాయని తెలిపారు. కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం.

Nagarjuna thanks to fans on collections

''నాన్నగారు నటించిన చివరి చిత్రం 'మనం'. మీ అందరికీ నచ్చేలా, కలకాలం నిలిచిపోయేలా తీర్చిదిద్దాం. నాన్నతో, చైతన్యతో కలిసి నటించడం ఓ తీపి జ్ఞాపకం'' అంటున్నారు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ కథానాయికలు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. నాగార్జున మాట్లాడుతూ ''70 ఏళ్ల తన సినీ జీవితంలో మనల్ని నవ్వించారు, కవ్వించారు, ఏడిపించారు ఏఎన్నార్‌. మన గుండెల్లో నిలిచిపోయారు. చివరి క్షణం వరకూ నటుడిగానే ఉండాలన్నది ఆయన కోరిక. దానికి ప్రతి రూపమే... 'మనం' అన్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary

 Nagarjuna tweeted "#ANRlivesOn Thank you for all the love/Meeru panchina premaki, choopistunna aadaranaki thanks cheppukotaniki matalu sari povu/mee Nagarjuna".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu