twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Ghost Official Collections: నాగార్జున సినిమాకు కొండంత కష్టం.. అన్ని కోట్ల టార్గెట్ కష్టమే!

    |

    బడా హీరో కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఇలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపిస్తోన్న ఆయన.. హిట్లు ఫ్లాపులను బేరీజు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున ఇటీవలే 'ది ఘోస్ట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి కలెక్షన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేయండి!

    ఘోస్ట్‌గా మారిపోయిన నాగార్జున

    ఘోస్ట్‌గా మారిపోయిన నాగార్జున

    అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రమే 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌‌గా చేసింది.

    తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షోతల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

    ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు

    ది ఘోస్ట్ ప్రీ బిజినెస్ వివారాలు


    ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన 'ది ఘోస్ట్' మూవీకి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లు, కర్నాటకలో రూ. 65 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లుతో కలిపి మొత్తంగా రూ. 21.15 కోట్లు బిజినెస్ అయింది.

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


    దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది ఘోస్ట్' చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టాక్ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై చూపించింది. ఫలితంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఇదే కంటిన్యూ అవుతూ 10వ రోజు కూడా ఈ చిత్రం రెండు కేవలం రూ. 4 లక్షలు మాత్రమే రాబట్టింది.

    మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!మళ్లీ రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి: టాప్ కిందకు జరిపి మరీ!

    10 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?

    10 రోజుల్లో ఎక్కడ? ఎంతొచ్చింది?


    10 రోజుల్లో 'ది ఘోస్ట్'కు ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లు తక్కువగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 58 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 79 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 4.18 కోట్లు షేర్, రూ. 7.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ఆంధ్రా, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 4.18 కోట్లు మాత్రమే రాబట్టిన 'ది ఘోస్ట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి రూ. 36 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇలా అన్ని ఏరియాలూ కలుపుకుని 10 రోజుల్లో నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ రూ. 5.09 కోట్లు షేర్‌, రూ. 9.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    యాక్షన్ నేపథ్యంతో రూపొందిన 'ది ఘోస్ట్' చిత్రానికి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజుల్లో దీనికి రూ. 5.09 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.91 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    English summary
    Akkineni Nagarjuna Did The Ghost Movie Under Praveen Sattaru Direction. This Movie Collect 5.09 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X