Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Veera Simha Reddy Day 2 collections: రెండవ రోజు ఊహించని డౌన్.. ఇది ఊహించలేదు బాలయ్య!
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఒక ప్రత్యేకమైన గ్లామరస్ పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమా మొదటి రోజు ఊహించని స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు ఈ సినిమా మొత్తం గా ఎంత కలెక్ట్ చేయవచ్చు అనే వివరాల్లోకి వెళితే..

విడుదలకు ముందే..
అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చిన వీర సింహారెడ్డిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే మార్కెట్లో మంచి డిమాండ్ అయితే పలికింది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే 73 కోట్ల వరకు బిజినెస్ చేసింది దీంతో 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది. అలాగే నిర్మాతలకు విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ ద్వారా ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది.

ఫస్ట్ డే సాలీడ్ కలెక్షన్స్
ఇక మొదటి రోజు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణలో 25 కోట్ల షేర్ అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 1.75 కోట్లు రాగా ఓవర్సీస్ లో మొత్తం 3.95 కోట్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 50 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్, 31.05 కోట్ల షేర్ అందుకోవడం విశేషం. ఒక విధంగా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అనేనుకున్న సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది.

రెండవ రోజు ఆక్యుపెన్సి
అయితే వీర సింహారెడ్డి రెండవ రోజు మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు అని అనిపిస్తుంది. థియేటర్స్ ఆక్యుఫెన్సీ పరంగా చూస్తే ఈ సినిమా నెల్లూరులో అలాగే విజయవాడలో గుంటూరులో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సి నమోదు చేసుకుంది. ఇక హైదరాబాదులో అలాగే విశాఖపట్నం నిజామాబాద్ ఏరియాలలో కలెక్షన్స్ కాస్త తక్కువగా వచ్చాయి.

రెండవ రోజు నెట్ కలెక్షన్స్
ఇక మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తంగా 33 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంటే రెండవ రోజు మాత్రం అంతకంటే తక్కువ స్థాయిలో ఇండియా మొత్తంలో అయితే 8.60 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 10 నుంచి 12 కోట్ల మధ్యలో గ్రాస్ రావచ్చని టాక్. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. ఒక విధంగా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపించినట్లుగా అనిపిస్తుంది.

రెండు రోజుల్లో టోటల్ కలెక్షన్స్
ఇండియా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండు రోజుల్లో 42.20 కోట్లు నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మార్నింగ్ షోలు రెండవ రోజు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఈవినింగ్ షోలకు కలెక్షన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.