Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ante Sundaraniki Collections: నానికి మరో షాక్.. 12వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే హిట్!
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోల్లో ఒకడిగా వెలుగొందుతూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని బాగా హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది 'శ్యామ్ సింగ రాయ్'తో భారీ హిట్ కొట్టిన నాని.. ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

సుందరంగా ఎంటరైన స్టార్ హీరో
నేచురల్
స్టార్
నాని
హీరోగా,
నజ్రియా
నజీమ్
హీరోయిన్‌గా
నటించిన
చిత్రమే
'అంటే..
సుందరానికీ!'.
టాలెంటెడ్
డైరెక్టర్
వివేక్
ఆత్రేయ
తెరకెక్కించిన
ఈ
రొమాంటిక్
ఎంటర్‌టైనర్
మూవీని
మైత్రీ
మూవీ
మేకర్స్
బ్యానర్‌పై
నవీన్
ఎర్నేని,
రవిశంకర్
యలమంచిలి
నిర్మించారు.
వివేక్
సాగర్
ఈ
చిత్రానికి
సంగీతం
అందించాడు.
ఈ
సినిమాలో
నరేష్,
నదియా
తదితరులు
నటించారు.
ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్
రొమాంటిక్ స్టోరీతో రూపొందిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నేచురల్ స్టార్ నాని - మలయాళ భామ నజ్రియా జంటగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో 12వ రోజు ఈ సినిమాకు కేవలం రూ. 16 లక్షలు మాత్రమే వచ్చాయి.
Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
'అంటే.. సుందరానికీ!' ఏపీ, తెలంగాణలో 12 రోజుల్లో కలెక్షన్లు ఇలా వచ్చాయి. నైజాంలో రూ. 6.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.02 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 93 లక్షలు, కృష్ణాలో రూ. 95 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రూ. 13.35 కోట్లు షేర్, రూ. 22.55 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
12 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 13.35 కోట్లు వసూలు చేసిన 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.62 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 20.57 కోట్లు వచ్చాయి. అంటే మరో 10.43 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.