Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఇంతే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న గొప్ప నటులు ఎంతో మంది ఉన్నారు. ఈ జాబితాలోకి వచ్చే నేటి తరం హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నాని ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 2 వారాల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

సుందరంగా ఎంట్రీ ఇచ్చిన నాని
టాలెంటెడ్ హీరో నాని ప్రధాన పాత్రలో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే ‘అంటే.. సుందరానికీ!'. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా తదితరులు కీలక పాత్రలు చేశారు.
స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

నాని మూవీకి ఓ రేంజ్ బిజినెస్
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘అంటే.. సుందరానికీ!' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 30 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
నేచురల్ స్టార్ నాని - మలయాళ భామ నజ్రియా జంటగా నటించిన ‘అంటే.. సుందరానికీ!' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా ఊహించినట్లుగా వచ్చాయి. అయితే, వీకెండ్ తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణలో 14వ రోజు ఈ సినిమాకు కేవలం రూ. 7 లక్షలే వచ్చాయి.
ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?
ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో ‘అంటే.. సుందరానికీ!' కలెక్షన్లు ఇలా వచ్చాయి. నైజాంలో రూ. 6.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.71 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రూ. 13.53 కోట్లు షేర్, రూ. 22.86 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
2 వారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 13.53 కోట్లు వసూలు చేసిన ‘అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.61 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.67 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!
Recommended Video


బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
నాని
నటించిన
‘అంటే..
సుందరానికీ!'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
30
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
31
కోట్లుగా
నమోదైంది.
ఇక,
2
వారాల్లోనే
దీనికి
రూ.
20.81
కోట్లు
వచ్చాయి.
అంటే
మరో
10.19
కోట్లు
రాబడితేనే
ఇది
హిట్
అవుతుంది.
అయితే,
ప్రస్తుత
పరిస్థితుల్లో
ఇది
కష్టమనే
చెప్పాలి.