twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ante Sundaraniki day 4 collections: 4వ రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. ఎంతంటే?

    |

    నేచురల్ స్టార్ నాని..చాలా కాలంగా సరైన హిట్ సినిమా లేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి ఆయన చివరిగా శ్యాం సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. మళ్ళీ ఫామ్లోకి వచ్చిన నాని తాజాగా 'అంటే.. సుందరానికి!' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి మొదటి రోజు నుంచి కొంచెం డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద కూడా పడింది. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    అంటే.. సుందరానికి!

    అంటే.. సుందరానికి!

    టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'అంటే.. సుందరానికి!'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో నరేష్, రేవతి, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందించాడు.

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

    నాని నటించిన 'అంటే.. సుందరానికి!' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లతో కలిపి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    నాలుగో రోజు ఎంత అంటే?

    నాలుగో రోజు ఎంత అంటే?

    'అంటే.. సుందరానికీ!'కి తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజూ అదే స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 0.71 కోట్లు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    4 రోజుల్లో ఎంత అంటే?

    4 రోజుల్లో ఎంత అంటే?

    4 రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికి!' బాగానే రాణించింది. దీంతో నైజాంలో 4.94 కోట్లు, సీడెడ్‌లో 1.11 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.25 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 0.89 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 76 లక్షలు, గుంటూరు జిల్లాలో 83 లక్షలు, కృష్ణా జిల్లాలో 78 లక్షలు, నెల్లూరు జిల్లాలో 55 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 11.11 కోట్ల షేర్, 18.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 11.11 కోట్లు వసూలు చేసిన నాని 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 16. 11 కోట్లు షేర్‌తో పాటు రూ. 28.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

    ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

    నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, నాలుగు రోజుల్లోనే దీనికి రూ. 16.11 కోట్లు వచ్చాయి. అంటే మరో 14.89 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే సినిమాకి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే అది లాంగ్ రన్ తోనే సాధ్యం. కొత్త సినిమాలు ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటి అనేది చూడాలి.

    English summary
    Natural Star Nani's Ante Sundaraniki Movie Under Vivek Athreya Direction Collected 16.11 Cr in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X