Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Ante Sundaraniki day 5 collections: మరింత దిగజారిన కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే?
నేచురల్ స్టార్ నాని చివరిగా శ్యాం సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. చాలా కాలంపాటు సరైన హిట్ లేక ఇబ్బందులు పడి ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చిన నాని తాజాగా 'అంటే.. సుందరానికి!' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాక మొదటి రోజు నుంచి కొంచెం డివైడ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద కూడా పడింది. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

అంటే.. సుందరానికి!
టాలీవుడ్
హీరో
నాని
నటించిన
తాజా
చిత్రం
'అంటే..
సుందరానికి!'.
వివేక్
ఆత్రేయ
తెరకెక్కించిన
ఈ
మూవీలో
నజ్రియా
నజీమ్
హీరోయిన్‌గా
నటించింది.
ఇక
ఈ
సినిమాలో
నరేష్,
రేవతి,
నదియా
తదితరులు
ఇతర
కీలక
పాత్రలు
పోషించారు.
శుద్ధ
బ్రాహ్మణ
కుటుంబానికి
చెందిన
సుందర్,
ఒక
క్రిస్టియన్
అయిన
లీల
అనే
అమ్మాయితో
ప్రేమలో
పడి
ఎలా
ఆ
ప్రేమను
గెలిచారన్నదే
సినిమా.
ఈ
సినిమాను
మైత్రీ
మూవీ
మేకర్స్
బ్యానర్‌పై
నవీన్
ఎర్నేని,
రవిశంకర్
యలమంచిలి
నిర్మించగా
యంగ్
మ్యూజిక్
డైరెక్టర్
వివేక్
సాగర్
సంగీతం
అందించాడు.
'అంటే..
సుందరానికి!'
సినిమాకు
నాని
మార్కెట్
దృష్ట్యా
తెలుగు
రాష్ట్రాల్లో
సహా
ప్రపంచవ్యాప్తంగా
రూ.
30
కోట్ల
ప్రీ
రిలీజ్
బిజినెస్
జరిగిందని
ట్రేడ్
వర్గాలు
అంచనా
వేశాయి.

ఐదో రోజు ఎంత అంటే?
'అంటే.. సుందరానికీ!'కి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కలెక్షన్స్ లో మరిన్ని డ్రాప్స్ కనిపించాయి. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్ష, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో.. రూ. 0.46 కోట్లు షేర్, రూ. 0.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5 రోజుల్లో ఎంత అంటే?
5 రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలో 'అంటే.. సుందరానికి!' బాగానే రాణించింది. దీంతో నైజాంలో 5.22 కోట్లు, సీడెడ్‌లో 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.31 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 0.92 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 78 లక్షలు, గుంటూరు జిల్లాలో 85 లక్షలు, కృష్ణా జిల్లాలో 81 లక్షలు, నెల్లూరు జిల్లాలో 56 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 11.57 కోట్ల షేర్, 19.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 11.57 కోట్లు వసూలు చేసిన నాని 'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 17.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 30.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
Recommended Video


బ్రేక్ ఈవెన్ కష్టమే?
నేచురల్
స్టార్
నాని
నటించిన
'అంటే..
సుందరానికీ!'
మూవీ
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
30
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
అంచనా
వేయడంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
31
కోట్లుగా
నమోదైంది.
ఇక,
ఐదు
రోజుల్లోనే
దీనికి
రూ
17.32
కోట్లు
వచ్చాయి.
అంటే
మరో
13.68
కోట్లు
రాబడితేనే
ఇది
క్లీన్
హిట్
స్టేటస్‌ను
సొంతం
చేసుకుంటుంది.
అయితే
సినిమాకి
వచ్చిన
టాక్
ప్రకారం
చూస్తే
అది
కష్టమని
అంటున్నారు.
మరో
రెండ్రోజుల్లో
ఎంట్రీ
ఇస్తున్న
విరాటపర్వం
సినిమా
దెబ్బకు
ఖచ్చితంగా
కొన్ని
థియేటర్స్
కోల్పోవాల్సి
ఉంటుంది.
కాబట్టి
బ్రేక్
ఈవెన్
కష్టమే
అనే
అంచనాలు
ఉన్నాయి.