Don't Miss!
- News
ఇక స్లీపర్ క్లాస్ `వందే భారత్` రైళ్లు- గంటకు 220 కిలోమీటర్ల వేగంతో: శతాబ్దికి రీప్లేస్..!!
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
Ante Sundaraniki Collections: ఘోరంగా పడిపోయిన కలెక్షన్స్.. డబ్బింగ్ సినిమా కంటే తక్కువగా
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేచురల్ స్టార్ నాని అనిపించుకున్నాడు నవీన్ కుమార్ ఘంటా. తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలు అందుకోవడంతో స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 'అంటే.. సుందరానికీ!' సినిమా ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

30 కోట్ల బిజినెస్
నేచురల్ స్టార్ నాని - మళయాళ భామ నజ్రియా నజీమ్ జంటగా నటించిన తాజా చిత్రం 'అంటే.. సుందరానికీ!'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్, నదియా, రేవతి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల బిజినెస్ అయింది.

ఎనిమిదో రోజు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అంటే.. సుందరానికీ!' మూవీకి మొదటి ఆట నుంచే కొంత డివైడ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగానే వచ్చినా క్రమ క్రమంగా వసూళ్లు మాత్రం పడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎనిమిదో రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని కేవలం రూ. 11 లక్షలు వసూలు అయ్యాయి. డబ్బింగ్ సినిమాగా వచ్చిన విక్రమ్ కంటే ఈ సినిమా వసూళ్లు తక్కువ.

ఎనిమిది రోజుల్లో
ఇక రెండు రాష్ట్రాల్లో 'అంటే.. సుందరానికీ!' ఎనిమిది రోజుల్లో తక్కువ కలెక్షన్లే వచ్చాయని చెప్పాలి. ఫలితంగా నైజాంలో రూ. 5.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 94 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, గుంటూరులో రూ. 88 లక్షలు, కృష్ణాలో రూ. 85 లక్షలు, నెల్లూరులో రూ. 58 లక్షలతో.. రూ. 12.16 కోట్లు షేర్, రూ.20.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎనిమిది రోజుల్లో రూ. 12.16 కోట్లు వసూలు చేసిన నాని'అంటే.. సుందరానికీ!' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.04 కోట్లు వసూలు చేసింది. వీటితో ఎనిమిది వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.18.56 కోట్లు షేర్‌తో పాటు రూ.32.93 కోట్లు గ్రాస్ వచ్చింది.

అసాధ్యమే
'అంటే.. సుందరానికీ!' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 18.56 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.44 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమే.