»   » నాని కి ఊహించని దెబ్బలే

నాని కి ఊహించని దెబ్బలే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2013 లో ఒక్క రిలీజ్ లేని ...నాని తన ఆశలన్ని తన వరస రిలీజ్ లపైనే పెట్టుకున్నారు. అయితే అవి ఊహించని విధంగా దెబ్బ కొడుతున్నాయి. కృష్ణ వంశీతో ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన పైసా చిత్రం చీదేసింది. అలాగే యష్ రాజ్ లాంటి పెద్ద బ్యానర్ లో చేసిన అహా కళ్యాణం చిత్రం సైతం సరైన ఓపినింగ్స్ కానీ టాక్ కానీ రాబట్టలేక దిగాలు పడింది. ఇక ఆయన తాజా చిత్రం జెండాపై కపిరాజు పైనే ఆశలు అన్నీ ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 7న విడుదల అవుతోంది. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'.

నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు.

ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు. అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

English summary
Nani didn't have single release in 2013 and now he has three releases in a span of one month. But Paisa sank without a trace at the box office and now Aaha Kalyanam opened to below average to average reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu