»   » నాని కుమ్మేశాడుగా..: ఓవర్ సీస్‌లో ఎంసీఏ కలెక్షన్స్ ఎంతో తెలుసా?..

నాని కుమ్మేశాడుగా..: ఓవర్ సీస్‌లో ఎంసీఏ కలెక్షన్స్ ఎంతో తెలుసా?..

Subscribe to Filmibeat Telugu
పేరుకే ‘మిడిల్ క్లాస్’.... కలెక్షన్లు మాత్రం అలా లేవు!

నేచురల్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను తనదైన నటనతో ఆకట్టుకుంటున్న నాని.. 2017లో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో మిలియన్ డాలర్స్ క్లబ్ లోనూ అడుగుపెట్టాడు.

మిలియన్ డాలర్ క్లబ్-ఎంసీఏ:

మిలియన్ డాలర్ క్లబ్-ఎంసీఏ:

నాని-సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన 'ఎంసీఏ' ఓవర్ సీస్‌లో మంచి కలెక్షన్లు రాబడుతోంది. గత గురువారం నాటికి ఈ సినిమా రూ.6.03కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. గతంలో నాని నటించిన 'నేను లోకల్', 'నిన్ను కోరి' సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరగా.. తాజాగా ఎంసీఏ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

 ఎంసీఏ ఓవర్ సీస్ కలెక్షన్స్:

ఎంసీఏ ఓవర్ సీస్ కలెక్షన్స్:

బుధవారం (ప్రివ్యూ), గురువారం (డిసెంబరు 21) కలిపి 423,361 డాలర్లతో ఎంసీఏ ఓవర్ సీస్‌లో మంచి ఓపెన్సింగ్ సొంతం చేసుకుంది. అలాగే శుక్రవారం 109,580 డాలర్లు, శనివారం 112,966 డాలర్లు, ఆదివారం 79,914 డాలర్లు, సోమవారం 92,728 డాలర్లు, మంగళవారం 66,747 డాలర్లు, బుధవారం 33,316 డాలర్లు, గురువారం 25,329 డాలర్లతో మొత్తం 942,941 డాలర్లు (రూ.6.03 కోట్లు) రాబట్టినట్లు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ..:

మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ..:

ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)కి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. పోటీనిచ్చే సినిమాలేవి లేకపోవడంతో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. సినిమాలో సాయిపల్లవి నటన, భూమిక-నాని సెంటిమెంట్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 దిల్ రాజు పంట పండింది:

దిల్ రాజు పంట పండింది:

ఎంసీఏ మంచి కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాత దిల్ రాజు పంట పండిందనే చెప్పాలి. వరుసగా ఆరు విజయాలను అందించిన 2017సంవత్సరం దిల్ రాజు కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ఏడాది ఆయన నిర్మించిన శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ.. ఈ ఆరు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించాయి.

 నాని ప్రాజెక్టులు:

నాని ప్రాజెక్టులు:

ప్రస్తుతం నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం'లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మీర్‌ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలోనూ మెరవబోతున్నాడు.

English summary
Nani has delivered a hat-trick of hits in 2017. His “MCA” has also become a big hit and it has now joined the club of million dollars. In its second weekend, the movie has touched this mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X