»   » నాని 'జెంటిల్‌మన్‌' టాక్ ఏంటి ?

నాని 'జెంటిల్‌మన్‌' టాక్ ఏంటి ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : భలే భలే మొగాడివోయ్ చిత్రం నుంచి మళ్లీ ఊపందుకున్న నాని తాజా చిత్రం 'జెంటిల్‌మన్‌'. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రం ఇప్పటికే చూసిన వారి నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం..ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ అని, ఫ్యామిలీలకు పట్టడం కష్టమని, అయితే సస్పెన్స్ చిత్రాలు చూసేవారికి, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి నచ్చుతుందని అంటున్నారు.

అలాగే సినిమాలో కొన్ని సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని , సస్పెన్స్ పార్ట్ ని మాత్రం సినిమా మొత్రం గ్రిప్పింగ్ గా నడిపారని చెప్తున్నారు. కామెడీ సన్నివేశాలు పెద్దగా లేవని, ఉన్న కాస్త కామెడీ సెకండాఫ్ లోనే వచ్చిందని, అదే మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తున్నారు. నాని ఎప్పటిలాగే తన నటనతో కట్టిపారేసారని, నివేదా ధామస్...కూడా టెర్రఫిక్ ఫెర్మార్మెన్స్ ఇచ్చింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు గొప్పగా లేవని చెప్తున్నారు.


Nani's Gentle man movie talk

ఫైనల్ గా క్లాస్ టచ్ తో నడిచే మంచి ప్రయత్నం ఇంద్రగంటి చేసారని చెప్తున్నారు. మర్డర్ ఇన్విస్టిగేషన్ తో సెకండాఫ్ స్లో అయ్యిందని, ఇలాంటి కథలకు ఇది తప్పదని చెప్తున్నారు. అయితే దర్శకుడు ట్విస్ట్ లను మెయింటైన్ చేయటంలో సక్సెస్ అయ్యాడని అంటున్నారు. సెకండాఫ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటంతో ఓవరాల్ గా ఓ యావరేజ్ సినిమా చూసిన ఫీల్ వచ్చిందని చూసినవారు అంటున్నారు. తీసేయదగ్గ సినిమా కాదని ఒక సారి మాత్రం చూడవచ్చని చెప్తున్నారు.


నాని హీరోగా పరిచయం అయింది ఇంద్రగంటి దర్శకత్వం వహించిన 'అష్టాచమ్మ' చిత్రం ద్వారనే కావడంతో 'జెంటిల్‌మన్‌'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్‌ హీరోయిన్స్.


అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌, రమాప్రభ, శ్రీముఖి, ఆనంద్‌, రోహణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : డేవిడ్‌ నాథన్‌, ఛాయాగ్రహణం : పి.జి.విందా. గతంలో పలు హిట్‌ సినిమాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త.

English summary
Gentleman movie is a good effort with a class touch. Movie is good in parts. Nani has get another above average film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu