»   » ‘నాన్నకు ప్రేమతో’ 6 డేస్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

‘నాన్నకు ప్రేమతో’ 6 డేస్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి పండగ, వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. అయితే సోమ, మంగళ వారాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా ఉండటం విశేషం.

ఓవర్సీస్ లో కూడ ఈ చిత్రం కలెక్షన్లు బావున్నాయి. ఇప్పటికే యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్ మార్కను అందుకున్న ‘నాన్నకు ప్రేమతో' ఫుల్ రన్ లో 2 మిలియన్ మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఎన్టీఆర్ కెరీర్లో 1 మిలియన్ మార్కను అందుకున్న 3వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'. సినీ గెలాక్సీ వారు ఈ చిత్రాన్ని యూఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ సంస్థకు కూడా 1 మిలియన్ మార్కు అందుకున్న 3వ సినిమా ఇది. ఇంతకు ముందు ఈ సంస్థ రిలీజ్ చేసిన మనం, భలే భలే మగాడివోయ్ చిత్రాలు 1 మిలియన్ మార్కు అందుకున్నాయి.


ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కు దాటలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో పాటు, రూ. 50 కోట్ల మార్కు దాటుతాడని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.


ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లో ఏపి, తెలంగాణల్లో రూ. 27.11 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో రూ. 11 కోట్ల పైనే వసూలు చేసింది. స్లైడ్ షోలో ‘నాన్నకు ప్రేమతో' 6 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ డీటేల్స్...


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 9.02 కోట్లు వసూలు చేసింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 5 కోట్లు వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 2.70 కోట్లు వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో తొలి 6 రోజుల్లో రూ. 2.73 కోట్లు వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 2.47 కోట్లు వసూలు చేసింది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 1.94 కోట్లు వసూలు చేసింది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో తొలి ఆరు రోజుల్లో రూ. 1.15 కోట్లు వసూలు చేసింది.
English summary
‘Nannaku Prematho’s 6 days Box office report. The Sukumar directorial is going great guns in both India and overseas. The collections on Tuesday have also been super strong.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu