»   » ‘నాన్నకు ప్రేమతో’ సెన్సార్ పూర్తి, టాక్

‘నాన్నకు ప్రేమతో’ సెన్సార్ పూర్తి, టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుకుమార్ తో కలిసి ఎన్.టి.ఆర్ చేసిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'. ఈ సాయింత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కూడా పూర్తి కావటంతో ఖచ్చితంగా ఈ సినిమా జనవరి 13న విడుదల అవుతుందనే విషయం ఖరారు అయినట్లైంది.

సెన్సార్ వారి టాక్ ప్రకారం..సినిమాలో ఎమోషన్ కంటెంట్ బాగుందని, హీరోకి విలన్ కు మధ్య జరిగే మైండ్ గేమ్ హైలెట్ గా ఉందని అంటున్నారు. సెన్సార్ వారు దర్శకుడుని, నిర్మాతను అభినందించినట్లు తెలుస్తోంది.


Nannaku Prematho censor Completed

ఈ సినిమాలో ఎన్టీఆర్ ...లండన్ బేస్డ్ ఎన్నారైగా కనిపిస్తారు. నాన్న చివరి కోరికను నెరవేర్చే కొడుకుగా కనిపిస్తారు. ఆ పాత్రలో వైవిధ్యమైన ఎమోషన్ ఉంటుంది. అది ఎన్టీఆర్ కు కూడా కొత్తే.


ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నకు ప్రేమతో చాలా సింపుల్, ప్లేన్ స్టోరీ. బేసిక్ ఎమోషన్ ఏంటన్నది సినిమాలోనే చూడాలి. కథైతే కొత్తదని చెప్పను. కథనం మాత్రం చాలా చాలా కొత్తగా ఉంటుంది. తండ్రి-కొడుకుల సెంటిమెంట్‌ను బేస్ చేసుకొని చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో అది చాలా కొత్తగా ఉంటుంది. ఆ కొత్తగా ఉండే అంశం ఏంటీ అన్నది మీరే సినిమా చూసి తెలుసుకోవాలి అన్నారు.


Nannaku Prematho censor Completed

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
NannakuPrematho censor clears with "U/A" & film is gearing up for BIG release confirmed on Jan 13. All the best. #NannakuPremathoOnJan13th!
Please Wait while comments are loading...